Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో స్టార్టప్స్ కోసం వెంచర్ బిల్డర్‌గా తమ కార్యక్రమాలను పెట్రికార్ ఇన్వెస్ట్మెంట్స్ నేడు ప్రకటించింది. గత సంవత్సర కాలంలో పెట్రిచార్ 6 స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టింది. తద్వారా కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి రెండురెట్ల వృద్ధిని నమోదుచేసింది. ప్రస్తుతం పెట్రికార్ ఫ్లోబుక్, మాగ్నమ్ వర్క్స్, బృందావన్ ఫార్మ్స్, సైబీ ల్యాబ్స్, డంకన్ మరియు రోజ్ ప్రాజెక్ట్స్ , ఎన్ రైప్ వంటి స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టింది. ఈ స్టార్టప్స్ ద్వారా ఐదు లక్షల మంది రైతులు, ఒక కోటి మంది విద్యార్ధులు, 100ఎంఎల్డీ పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధికి మద్దతునందిస్తూ 2025 నాటికి 100% కార్బన్ న్యూట్రల్ కంపెనీగా నిలువనుంది.
‘‘ఎలాంటి స్టార్టప్ అయినా నాలుగు అంశాలు కావాల్సి ఉంటుంది ః విజిబిలిటీ మరియు మార్కెట్ భాగస్వామ్యాలు, మృదువైన కార్యకలాపాల కోసం అంతర్గత నిర్మాణం, టాలెంట్ ఎక్వైజేషన్ మరియు సాంకేతికతను ఎనేబలర్గా నిలుపుకోవడం. నూతన వ్యాపార ఆలోచనలకు నిలయంగా భారత్ నిలువడంతో పాటుగా అంతర్జాతీయ మదుపరులను ఆకర్షిస్తుంది. రాబోయే సంవత్సరాలలో ఇది మరింతగా వృద్ధి చెందనుంది. సరైన ఆలోచనలు కలిగిన వ్యక్తులతో కలిసి సరైన సమయంలో, సరైన కంపెనీలో పెట్టుబడులు పెట్టనున్నాం’’ అని పెట్రికార్ ఇన్వెస్ట్మెంట్స్ ఫౌండర్, శ్రావనాథ్ దేవభత్కిని అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రతి సంవత్సరం నాలుగు స్టార్టప్స్‌లో పెట్టుబడులను పెట్రికార్ పెట్టనుంది. రాబోయే ఐదేళ్లలో 25 కంపెనీలను నిర్మించడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది.