Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎరువుల నియంత్రణ ఆర్డర్లలో బయో స్టిమ్యులెంట్స్ను జోడించడాన్ని అగ్రో ఇన్పుట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎయిమ్) స్వాగతించడంతో పాటుగా భారత ప్రభుత్వం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈలు పూల్డ్ డాటా సమర్పించేందుకు అనుమతించాల్సిందిగా డిమాండ్ చేసింది.
పూనె కేంద్రంగా కలిగిన అసోసియేషన్‌ను 2010లో ఏర్పాటుచేశారు. దీనిలో 300 మంది సభ్యులు భారతదేశవ్యాప్తంగా ఉన్నారు. వ్యక్తిగత తయారీదారులకు ఈ డాటా పొందడం కష్టమవడంతో పాటుగా లభ్యత ఉండదని ఎయిమ్ వెల్లడిస్తూ, ఈ పూల్డ్ డాటాను చిన్న తయారీదారులు సైతం వినియోగించేందుకు అనుమతించడం ద్వారా వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసుకోగలరన్నారు.
ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సీఓ) 1985 పరిధిలోకి బయో స్టిమ్యులెంట్స్ను తీసుకువచ్చారు. అయితే ఈ మార్గదర్శకాలు ఆవిష్కరణలను ప్రోత్సహించే రీతిలో ఉండాల్సి ఉందని ఎయిమ్ భావిస్తోంది. ఈ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి బయోస్టిమ్యులెంట్స్ కోసం డాటా సృష్టించడానికి ఇది కృషి చేస్తుంది. ఈ పూల్డ్ డాటాను అనుమతించాల్సిందిగా ప్రభుత్వ అధికారులకు ప్రతిపాదనలను ఎయిమ్ పంపించింది. తద్వారా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఈ డాటా వినియోగించడంతో పాటుగా తమ వ్యాపారాలను సైతం సమృద్ధి చేసుకోగలవు. పేర్కొనబడిన డాటా సృష్టించడానికి దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఇది ఎంఎస్ఎంఈలు భరించడం కష్టం. ఆగ్రోకెమికల్స్ నమోదులో పూల్డ్ డాటా కొత్తేమీ కాదు. అందువల్ల బయో స్టిమ్యులెంట్స్లో సైతం దీనిని అనుమతించాల్సి ఉందని అసోసియేషన్ కోరుతుంది.
‘‘నూతన బయో స్టిమ్యులెంట్ నోటిఫికేషన్‌ను మేము స్వాగతిస్తున్నాము. దీనిద్వారా ఎఫ్సీఓ 1985 పరిధిలోకి బయో స్టిమ్యులెంట్స్ వచ్చాయి. ఈ నూతన మార్గదర్శకాలతో బయో స్టిమ్యులెంట్స్ కు రిజిస్టర్డ్ అగ్రి ఇన్పుట్ హోదా లభిస్తుంది మరియు జెన్యూన్ తయారీదారులు తమ వ్యాపారాలను సగర్వంగా చేసుకునే వీలునూ కల్పిస్తుంది’’ అని ఎయిమ్ అధ్యక్షులు రాజ్‌కుమార్ ధుర్గుడ్ అన్నారు. ఎయిమ్ అసోసియేషన్ పూల్డ్ డాటా తప్పనిసరిగా అంగీకరించాలని ఎయిమ్ అసోసియేషన్ సెక్రటరీ సమీర్ పథారీ అన్నారు. ఇది చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు గౌరవం అందిస్తుందన్నారు. ఎయిమ్ అసోసియేషన్ డిప్యూటీ సెక్రటరీ వైభవ్ కాషికర్ మాట్లాడుతూ మనం బయోస్టిమ్యులెంట్ రెగ్యులేషన్స్ ఆవల, వాటి నిర్వహణ సవాళ్లను సైతం చూడాల్సి ఉందన్నారు. తమ వ్యాపారాలు, పరిశ్రమను తరువాత దశకు తీసుకువెళ్లేందుకు వచ్చిన అవకాశంగా దీనిని భావించాల్సి ఉందన్నారు. ఈ అసోసియేషన్ ఇప్పుడు ప్రోవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఫార్మ్–జీ3) డెడ్‌లైన్‌ను ఫిబ్రవరి 22, 2023కు మరో సంవత్సరం పొడిగించాల్సిందిగా కోరుతుంది.