Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ గ్లెన్మార్క్ టైప్ 2 మధుమేహుల కోసం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషదం 'టెనెలిగ్లిప్టిన్ంపియోగ్లిటజోన్'ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగిన పెద్ద వారిలో అంటే నియంత్రణలో లేని మెట్ఫార్మిన్ కారణంగా మధుమేహం తీవ్రంగా కలిగిన, అదనపు టెనిలిగ్లిప్టిన్, పియోగ్లిటజోన్ ఎస్సీపరేట్ డ్రగ్స్ కలిగిన వారిలో గ్లిసెమిక్ నియంత్రణ మెరుగుపరిచేందుకు ఇది సహాయపడుతుందని తెలిపింది. దీనిలో టెనెలిగ్లిప్టిన్ (20ఎంజి), పియోగ్లిటజోన్(15ఎంజి) అందుబాటులో తెచ్చామని పేర్కొంది. దీనిని రోజుకు ఒక్కసారి వాడితే చాలని తెలిపింది.