Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత విశ్వశనీయమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్ సంగ్, నేడు తమ ఆధునిక ఎక్స్ టర్నల్ స్టోరేజ్ డివైజ్ టి7 షీల్డ్ పోర్టబుల్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ (పీఎస్ఎస్ డీ)ఆరంభోత్సవాన్ని ప్రకటించింది, మన్నికైన, క్రెడిట్ కార్డ్ సైజ్ డిజైన్ లో సాటిలేని పనితీరు మరియు విశ్వశనీయతని తెచ్చింది. టీ7 షీల్డ్ అనేది శామ్ సంగ్ టీ7 పోర్టబుల్ ఎస్ ఎస్ డీ కుటుంబానికి సరికొత్త చేరిక , నాజూకైన డిజైన్ లో అతుల్యమైన వేగవంతమైన స్పీడ్స్ ని రోజూ కేటాయించే డ్రైవర్ టీ7 , మెరుగుపరచబడిన డేటా రక్షణ కోసం బిల్ట్-ఇన్ వేలిముద్ర సెన్సర్ తో సీఈఎస్ అవార్డ్ గ్రహీత పీఎస్ఎస్ డీ, టీ7 టచ్ లు భాగంగా ఉన్నాయి.
"సృజనాత్మకమైన ప్రొఫెషనల్స్ మరియు ప్రయాణించే వినియోగదారులుకోసం రూపొందించబడిన , టి7 షీల్డ్ పోర్టబుల్ ఎస్ఎస్ డీ అనేది మన్నికైన, ఉన్నతమైన పని సామర్థ్యం కలిగిన, విశ్వశనీయమైన ఎస్ఎస్ డీ. వినియోగదారుల డేటా నీటికి బహిర్గతమైనా, బయట ఉపయోగించినా, క్రింద పడిపోయినా సురక్షితంగా ఉంచేలా నిర్థారించే కఠినమైన, దృఢమైన డివైజ్ ఇది. టీ7 షీల్డ్ పోర్టబుల్ ఎస్ఎస్ డీ విస్త్రతమైన అనుకూలతని అందిస్తోంది. పీసీలు, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ మరియు గేమింగ్ కన్సోల్స్ సహా పలు డివైజ్ లలో కొత్త ఎస్ఎస్ డీ ని వినియోగదారులు ఉపయోగించేలా వీలు కల్పిస్తుంది," అని పునీత్ సేథీ, వైస్ ప్రెసిడెంట్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎంటర్ ప్రైజ్ బిజినెస్, శామ్ సంగ్ ఇండియా అన్నారు.
ఐపీ 65- ప్రామాణికత గల మన్నిక
టీ7 షీల్డ్ అనేది ఇప్పటి వరకు శామ్ సంగ్ వారి అత్యంత మన్నికైన పీఎస్ ఎస్ డీ. జీవిత ప్రమాదాల్లో లేదా అంశాలకు బహిర్గతమవడం వలన డాటా నష్టపోవడం గురించి విచారించకుండా సమృద్ధియైన డేటా అనుభవం అవసరమైన ప్రయాణికులు లేదా అవుట్ డోర్ కంటెట్ సృష్టికర్తలు కోసం ఇది అనుకూలమైనది. లోపలి నుండి బయటకు శామ్ సంగ్ చే జాగ్రత్తగా రూపొందించబడిన టీ 7 షీల్డ్ మూడు మీటర్లు ఎత్తు నుండి పడిపోయినా షాక్-నిరోధకతని కలిగి ఉంది, కాగా ఐపీ 65- డస్ట్ ప్రూఫ్ మరియు నీటి నిరోధకంగా ధృవీకరించబడింది. కఠినమైన కొత్త డిజైన్ అయినా కూడా, టీ 7 షీల్డ్ పొందికైనది మరియు తేలికైనది, 98 గ్రాములకు మించిన బరువు గలది.
సాటిలేని పనితీరు
టి 7 షీల్డ్ ప్రతి సెకనుకు (ఎంబీ/సెకనులు) 1,050 మెగాబైట్స్ రీడ్ స్పీడ్ అందిస్తుంది మరియు 1,000 ఎంబీ/సెకనుల వేగాన్ని రాస్తుంది, యూఎస్ బీ 3.2 జెన్ 2 స్టాండర్డ్ ఆధారంగా ప్రస్తుతం లభిస్తున్న అత్యంత వేగవంతమైన ట్రాన్స్ ఫర్ స్పీడ్స్ గా పేరు పొందింది. దీనికి ముందు వచ్చిన టీ 5 కంటే ఇది సుమారు రెండు రెట్లు ఎక్కువ వేగవంతమైనది మరియు ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ (హెచ్ డీడీలు) కంటే 9.5 రెట్లు ఎక్కువ వేగవంతమైనవి, వినియోగదారులు, డిజిటల్ సృష్టికర్తలు మరియు ప్రొఫెషనల్స్ యొక్క విలువైన సమయాన్ని ఆదా చేస్తోంది.
ఉపరితలం మెటీరియల్ ని మార్చడం ద్వారా శామ్ సంగ్ ప్రోడక్ట్ లోపల, బయట కూడా అనుకూలంగా చేసింది మరియు సామర్థ్యం తగ్గిపోవడాన్ని పరిష్కరించడానికి మరియు పెద్ద ఫైల్స్ ని ట్రాన్స్ ఫర్ చేసే సమయంలో కలిగే అధిక వేడిని తట్టుకోవడానికి టి7 షీల్డ్ సాఫ్ట్ వేర్ ని మెరుగుపరిచింది. ఈ మార్పు వలన, 2టీబీ వంటి ఫైల్స్ ని ఒకేసారి ట్రాన్స్ ఫర్ చేసినప్పుడు కూడా పని సామర్థ్యంలో క్షీణత లేదు మరియు వేడి కలగడం తక్కువైంది, ఇది వినియోగదారులు అనుభవించే అసౌకర్యాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా, అత్యంత నాణ్యత గల రికార్డింగ్, ఎడిటింగ్, ఎన్ కోడింగ్ మరియు రెండరింగ్ వంటి భారీ, నిరంతర పనులు వంటి డేటాని నిర్వహించేటప్పుడు కూడా పనితీరు తగ్గిపోకుండా డేటాని స్థిరంగా ప్రసారం చేయడం సాధ్యమవుతుంది. ఇది స్థిరంగా లేని డ్రైవ్ పనితీరు గురించి ఆందోళనల్ని తగ్గిస్తుంది.
విస్త్రతమైన అనుకూలత, బలమైన భద్రత
పలు డివైజ్ లలో పని చేయడానికి రూపొందించబడిన, శామ్ సంగ్ వారి టీ7 షీల్డ్ ఎక్కువ సంఖ్యలో పిక్చర్స్, గేమ్స్, 4కే మరియు 8 కే వీడియోలని పీసీ, మ్యాక్, స్మార్ట్ ఫోన్ (ఆండ్రాయిడ్) లేదా గేమ్ కన్సోల్ పై భద్రపరచగలదు. అదనంగా, హార్డ్ వేర్ ఎన్ క్రిప్షన్ తో టీ7 షీల్డ్ భద్రతని (*256 - బిట్ ఏఈఎస్, అడ్వాన్స్ డ్ ఎన్ క్రిప్షన్ స్టాండర్డ్ ) శక్తివంతం చేసింది. అందువలన టీ7 షీల్డ్ ని కోల్పోయినా కూడా వినియోగదారు డేటా సురక్షితంగా కాపాడబడగలదు. ప్లస్, ఇది యూజర్లు సౌకర్యవంతంగా డ్రైవ్ ని నిర్వహించడానికి శామ్ సంగ్ మెజీషియన్ సాఫ్ట్ వేర్ ఉపయోగించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది.
పర్యావరణహితమై ప్యాకేజింగ్
శామ్ సంగ్ వారి ఇతర పొందికైన ఎస్ఎస్ డీ శ్రేణిలతో, టి 7 షీల్డ్ ఇంతకు ముందు తరాలకు చేసిన వాటితో పోల్చినప్పుడు ట్రే ప్యాకేజింగ్ యొక్క మూడొంతులలో ఒక వంతు ప్యాకేజింగ్ ని ఉపయోగిస్తూనే, ఉత్పత్తి సామర్థ్యం ద్వారా ఉత్పత్తి చేసే సమయంలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల్ని తగ్గిస్తుంది.
ధర:
యూజర్ ప్రాధాన్యతల్ని సంతృప్తిపరచడానికి బీజ్, నలుపు, నీలం రంగుల్లో లభిస్తుంది. టీ7 షీల్డ్ 1 టీబీ మరియు 2 టీబీ సైజ్ లలో లభిస్తోంది, వినియోగపు కేసులు యొక్క విస్త్రతమైన శ్రేణి కోసం అనుకూలంగా చేసింది. 2టీబీ ఐఎన్ఆర్ 22,999కి మరియ 1 టీబీ ఐఎన్ఆర్ 12,999కి లభిస్తున్న టీ7 షీల్డ్ అన్ని శామ్ సంగ్ రీటైల్ స్టోర్స్, ప్రముఖ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ మరియు శామ్ సంగ్ వారి అధికారి ఆన్ లైన్ స్టోర్ శామ్ సంగ్ దుకాణం సహా ఆన్ లైన్ వేదికల్లో లభిస్తున్నాయి. యూఎస్ బీ రకం-సీ-నుండి సి కేబుల్ తో డ్రైవ్ లభిస్తోంది మరియు యూఎస్ బీ రకం సీ నుండి ఏ కేబుల్ తో లభిస్తోంది. మరింత సమాచారం కోసం, దయచేసి https://www.samsung.com/in/memory-storage/portable-ssd/ ని సంప్రదించండి.
1) 1 జీబీ =1,000,000,000 బైట్స్ , 1 టీబీ=1,000,000,000,000 బైట్స్. వివిధ కొలతల స్టాండర్డ్ వాడకం వలన కంప్యూటర్స్ ద్వారా దిగువ సామర్థ్యం ప్రదర్శించబడవచ్చు.
2) సామర్థ్యాన్ని బట్టి ప్రోడక్ట్ యొక్క ఖచ్చితమైన బరువు మారవచ్చు.
3) గరిష్ట డేటా ట్రాన్స్ ఫర్ వేగం శామ్ సంగ్ అంతర్గత పరీక్షా ప్రామాణాలు ఆధారంగా జత చేయబడిన కేబుల్ తో కొలవబడుతుంది. హోస్ట్ ఆకృతి, కేబుల్ మరియు యూజర్ సిస్టం వాతావరణం పై ఆధారపడి సామర్థ్యం మారవచ్చు.
4) నియంత్రించబడిన పరిస్థితులు ద్వారా నిర్వహించబడిన అంతర్గత పరీక్ష ఆధారంగా టీ7 షీల్డ్ కి ఐపీ 65 రేటింగ్ ఉంది. నీరు మరియు దుమ్ము నిరోధకత సామర్థ్యాలు అసలు వాతావరణం పరిస్థితుల్ని బట్టి మారవచ్చు. ద్రవం మరియు దుమ్ము వలన కలిగిన హాని వారంటీ క్రింద కవర్ చేయబడదు.
*ఐపీఎక్స్ 5 పరీక్షా పరిస్థితి : 3 నిముషాలు వరకు 12.5 లీ/నికి 3 మీటర్లు దూరంగా నాజల్ (Φ6.3మీమీ) నుండి వచ్చిన తాజా నీటికి డివైజ్ బహిర్గతమైంది.
** ఐపీ6X పరీక్షా పరిస్థితి : వాక్యూం ఛాంబర్ లో 8 గంటలు వరకు 2కేపీఏ క్రింద ఒత్తిడితో 2కేజీ/ఎం3 యొక్క చురుకైన దుమ్ముకి డివైజ్ బహిర్గతమైంది.
5) నియంత్రించబడిన పరిస్థితులలో డ్రాప్ పరీక్ష నిర్వహించబడింది. డ్రాప్ నిరోధకత అసలైన పర్యావరణ పరిస్థితులు పై ఆధారపడి మారవచ్చు. క్రింద పడిపోవడం వలన కలిగిన హాని వారంటీ క్రింద కవర్ చేయబడదు.
6) టీ7 సీరీస్ సాఫ్ట్ వేర్ కనీస సిస్టం ఆవశ్యకతలు : విండోస్ 7 లేదా ఎక్కువ, మ్యాక్ ఓఎస్ x 10.10 లేదా ఎక్కువ, ఆండ్రాయిడ్ లాలిపప్ లేదా ఎక్కువ.
7) కేస్ ఉష్ణోగ్రత కేస్ పై అతి వేడి పాయింట్ లో కొలవబడుతుంది. డివైజ్ పని చేసే ఉష్ణోగ్రతలో భారీ పని భారం పై కావలసినంత గాలి ప్రవాహం సక్రమంగా పని చేయాల్సిందిగా సిఫారసు చేయబడింది."
8) డేటా లేదా శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ లో ఉన్న ఇతర సమాచారం మరియు స్టోరేజ్ డివైజ్ లు లేదా యూజర్ లాభం లేదా ఆదాయం కోల్పోవడం భరించడం సహా అయితే దీనికి మాత్రమే పరిమితం కాకుండా శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ఎటువంటి నష్టానికి బాధ్యతవహించదు. వారంటీ పై మరింత సమాచారం కోసం దయచేసి సందర్శించండి https://samsung.com/portable-ssd