ఫోన్ ఫే బ్రాండ్ అంబాసిడర్లుగా సమంత, దుల్కర్ సల్మాన్
నవతెలంగాణ హైదరాబాద్ : ఫోన్ ఫే తన బ్రాండ్ అంబాసిడర్లుగా దక్షిణ భారత మార్కెట్ల కోసం పాపులర్ జంటైన సమంత, దుల్కర్ సల్మాన్ నియమించింది. ఈ కొత్త క్యాంపెయిన్ గురించి ఫోన్ ఫే బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రమేశ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.... గత ఆరు నెలల్లో తాము ఇన్సూరెన్స్ కథలు చెప్పడం ద్వారా తమ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను మార్కెట్ చేశామన్నారు. వినియోగదారులకు పనికి వచ్చే ఉత్పత్తులను ముందుకు తీసుకు వచ్చేందుకు తేలికగా అర్థమయ్యే ప్రచారాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఫోన్లో టెన్షన్ లేని ఇన్సూరెన్స్ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా, టూవీలర్ ఇన్సూరెన్స్ పై దృష్టిపెట్టే ప్రచారాన్ని తాము ప్రారంభించామన్నారు.