Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వరుసగా 16 సంవత్సరాల పాటుగా ప్రపంచం యొక్క అగ్రశ్రేణి టీవీ తయారీదారు అయిన శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్, కర్బన పాదముద్రను తగ్గించడానికి తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తన 2022 నియో క్యూఎల్ఈడీ టీవీలు కార్బన్ ట్రస్ట్ నుండి 'కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు’ ధృవీకరణను పొందినట్లుగా ప్రకటించింది.
కార్బన్ ట్రస్ట్ అనేది కర్బన రహిత భవిష్యత్తు దిశగా మానవాళి వేస్తున్న అడుగుల్ని వేగవంతం చేయాలనే ధ్యేయముతో పనిచేస్తున్న ఒక ప్రపంచస్థాయి వాతావరణ సలహా సంస్థగా ఉంది. 'కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు’ ధృవీకరణ అనేది, ఒక ఉత్పాదన యొక్క కర్బన పాదముద్ర ప్రతి సంవత్సరమూ తగ్గుకుంటూ వచ్చే గణనీయతను తెలియజేస్తుంది. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణాలను ఉపయోగించి, సంపూర్ణ ఉత్పాదనా జీవిత చక్రమంతటా ఉత్పన్నమయ్యే జిహెచ్జి (గ్రీన్ హౌస్ వాయువు) యొక్క పరిమాణమును మదింపు చేస్తుంది.
ఈ సంవత్సరం, శామ్సంగ్ యొక్క 2022 టీవీ లైనప్ వ్యాప్తంగా మూడు నియో క్యూఎల్ఈడీ 8K మోడళ్ళు, మూడు నియో క్యూఎల్ఈడీ 4K మోడళ్ళు, రెండు క్యూఎల్ఈడీ మోడళ్ళు, రెండు లైఫ్‌స్టైల్ టీవీ మోడళ్ళు, ఒక క్రిస్టల్ యుహెచ్‌డి టీవీ మోడల్ తో సహా 11 మోడళ్ళు ఉత్పాదన యొక్క బరువును, వాడుగ దశలో విద్యుత్ వినియోగమును తగ్గించడం ద్వారా ఈ ధృవీకరణను పొందాయి.
శామ్సంగ్ కేవలం ఉత్పాదన నవ్యతను ముందుకు నడపడమే కాకుండా వాతావరణ సుస్థిరతా సాంకేతిక పద్ధతులను రూపకల్పన చేయడం మరియు వాటిని అమలు చేయడం పట్ల ఎంతో సుదీర్ఘకాలంగా కట్టుబడి ఉంటోంది. సిఇఎస్ 2022 వద్ద శామ్సంగ్ యొక్క ప్రధాన వేడుక సందర్భంగా, వైస్-ఛైర్మన్, సిఇఓ మరియు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ డివైజ్ ఎక్స్-పీరియెన్స్ (డిఎక్స్) విభాగం యొక్క అధిపతి శ్రీ జాంగ్-హీ (జెహెచ్) హాన్, మన ధరిత్రిని పరిరక్షించుకోవడానికి గాను ప్రపచవ్యాప్త సమాజములో భాగంగా ఒక సుస్థిరమైన భవిష్యత్తును ఏర్పరచడానికి మరియు సమన్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికై శామ్సంగ్ యొక్క నిబద్ధతను ఎత్తి చూపుతూ కంపెనీ యొక్క దార్శనికత "రేపటి కోసం కలిసికట్టుగా’ ను వెల్లడించారు.
ఈ చొరవలో భాగంగా, శామ్సంగ్ యొక్క దృశ్యాత్మక ప్రదర్శనా వ్యాపారము, తన దృశ్యాత్మక ఉత్పత్తులను తయారు చేయడానికి తాను 2021లో ఉపయోగించిన వాటికంటే సుమారు 30 రెట్లు ఎక్కువగా రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించాలని సంకల్పించడమైనది. 2025 నాటికి తన మొబైల్, గృహోపకరణ ఉత్పత్తులు అన్నింటిలోనూ రీసైకిల్ చేయబడిన పదార్థాల వినియోగమును విస్తరించుటకు గాను శామ్సంగ్ తన ప్రణాళికను కూడా వెల్లడించింది. దీనికి అదనంగా శామ్సంగ్, తన ఉత్పత్తుల యొక్క జీవితదశలు అన్నింటా వాతావరణ ప్రభావాలను తగ్గించడానికి గాను వివిధ రకాల సుస్థిర పద్ధతులను అవలంబిస్తోంది. టీవీ ఉత్పత్తులను బహుముఖమైన ఫర్నిచర్ వస్తువులుగా ప్యాకేజింగ్‌ని అప్‌సైకిల్ చేయడానికి వినియోగదారులకు వీలు కలిగించే కంపెనీ యొక్క ‘ఈకో-ప్యాకేజింగ్’ ప్రోగ్రాము – 90% తక్కువ ఇంకును ఉపయోగిస్తూ మరియు ఉత్పత్తి సందర్భంగా స్టేపుల్స్ ని కూడా తొలగింపజేస్తూ ఉత్పాదన ప్యాకేజింగ్ ఈ సంవత్సరం ఉన్నతీకరించబడింది.
శామ్సంగ్ 2022 లో తన అన్ని టీవీ మోడల్స్ కూ, అంతర్నిర్మితమైన సోలార్ ప్యానల్స్ తో బ్యాటరీ వ్యర్థాలను రూపుమాపే సోలార్ సెల్ రిమోట్ ను కూడా విస్తరింపజేసింది. అదనంగా శామ్సంగ్, సముద్ర వ్యర్థాన్ని తగ్గించుటకు మరియు పర్యావరణ పాదముద్రను కనిష్టం చేయడానికి గాను 2022 హై-రిజొల్యూషన్ మానిటర్ S8 కోసం పునరుద్దేశిత సముద్ర-ఆధారిత ప్లాస్టిక్స్ తో తయారు చేయబడిన ఒక కొత్త మెటీరియల్‌ని అభివృద్ధిపరచి వాడుకలోనికి తీసుకొంది. “వరుసగా 16 సంవత్సరాల పాటు మార్కెట్ దిగ్గజంగా ఉంటున్న శామ్సంగ్, కేవలం సాంకేతిక పరమైన ఆధునికతలపై మాత్రమే కాకుండా మానవ-కేంద్రిత సాంకేతికత మరియు పర్యావరణం చుట్టూ నవ్యతల పట్ల కూడా దృష్టి సారిస్తోంది,” అన్నారు, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ యందు విజువల్ డిస్ప్లే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు పరిశోధన మరియు అభివృద్ధి బృందం యొక్క అధిపతి శ్రీ సియోక్వూ యాంగ్ గారు. “శామ్సంగ్ తన "హరిత నడక’ దార్శనికతకు అనుగుణంగా వివిధ సుస్థిరతా చొరవ పద్ధతులు మరియు పర్యావరణ-హితమైన కార్యకలాపాలను అమలు చేయడం కొనసాగిస్తుంది.”