Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సాజెన్ ఎంఐ కెనడా(సాజెన్) నుంచి పెట్టుబడులు సమీకరించినట్టు ఇండియా మార్ట్గేజ్ గ్యారెంటీ కార్పోరేషన్ (ఐఎంజీసీ) తెలిపింది. ప్రైమరీ ఫండింగ్ రౌండ్లో 31 శాతం వాటాలను స్వాధీనం చేయనున్నట్టు పేర్కొంది. ఈ ప్రతిపాదిత లావాదేవీ చట్టబద్ధమైన, రెగ్యులేటరీ అనుమతులు అందుకున్న తరువాత ముగుస్తుందని వెల్లడించింది. కాగా ఒప్పంద విలువను ఆ సంస్థ వెల్లడించలేదు. ఐఎంజిసిలో ప్రస్తుతం నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పోరేషన్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఎనాక్ట్ హౌల్డింగ్స్ ఇంక్లు వాటాదారులుగా ఉన్నారు.