Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నికర లాభాలు రెట్టింపు అయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.355 కోట్ల నికర లాభాలు సాధించింది. మొండి బాకీలు, కేటాయింపుల భారం తగ్గడంతో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. పూణె కేంద్రంగా పని చేస్తున్న ఈ బ్యాంక్ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.165.23 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం 3,948 కోట్లుగా ఉండగా.. క్రితం క్యూ4లో 4,334.98 కోట్లకు పెరిగింది. 2021-22లో మొత్తంగా రూ.1,151.64 కోట్ల నికర లాభాలు సాధించినట్లు తెలిపింది. ఇంతక్రితం ఏడాది రూ.551.41 కోట్ల లాభాలతో పోల్చితే రెట్టింపు వృద్థి చోటు చేసుకున్నట్టు వెల్లడించింది.