Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్‌పే దక్షిణాది మార్కెట్ కోసం ప్రముఖ నటులు సమంతా ప్రభూ, దుల్కర్ సల్మాన్‌లను ప్రచారకర్తలుగా నియమించు కున్నట్టు తెలిపింది. ముఖ్యంగా ద్విచక్ర వాహన బీమా క్యాంపెయిన్ కోసం వీరిని ఉపయోగించుకోనున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని వీరి ఇరువురిని బ్రాండ్ అంబాసీడర్లుగా ఎంచుకుంది. తమ వేదికలో బీమా ఉత్పత్తులను మార్కెట్‌ను పెంచుకోవడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడనుందని ఫోన్‌పే బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రమేష్ శ్రీనివాసన్ తెలిపారు.