Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ప్రయివేటు రంగ విత్త సంస్థ యాక్సిస్ బ్యాంక్ 54 శాతం వృద్థితో రూ.4,118 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,677 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో సంస్థ నికర వడ్డీపై ఆదాయం (ఎన్ఐఐ) 7,555 కోట్లుగా ఉండగా.. క్రితం క్యూ4లో 16.7 శాతం పెరిగి 8,819 కోట్లకు చేరింది. బ్యాంక్ రుణ వృద్థి 15 శాతం, డిపాజిట్లలో 19 శాతం పెరుగుదల చోటు చేసుకున్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.