Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టెక్నలాజీ సొల్యూషన్స్ కంపెనీ సైయంట్ తాజాగా సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న గ్రిట్ కన్సల్టింగ్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. దీన్ని రూ.283 కోట్ల (37 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేసినట్లు సైయంట్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గ్రిట్ కన్సల్టింగ్ ముఖ్యంగా లోహ మైనింగ్, ఎనర్జీ రంగాల్లో ప్రావీణ్యత కలిగి ఉందని సైయంట్ సిఇఒ, ఎండి క్రిష్ణా బొడనపు తెలిపారు. అన్ని రంగాల్లో ఖాతాదారులను సంపాదించడానికి తమకు ఈ స్వాధీనం మద్దతునియ్యనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.