Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు వేరు వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరి వ్యక్తుల కథ 'దేవతలారా దీవించండి`
హైదరాబాద్, 29 ఏప్రిల్, 2022: కళ్యాణం కమనీయంతో గుండెకు హత్తుకునేలా ఒక తల్లీ కూతుర్ల కథని మనముందుకి తెచ్చిన మన జీ తెలుగు మరొక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు - 'దేవతలారా దీవించండి` ని తీసుకొస్తుంది. మీరు మీ టీవీ సెట్లకు పూర్తిగా అతుక్కుపోయేలా చేయడానికి జీ తెలుగు సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో శ్రీవల్లిగా చైత్రా సక్కరి, సామ్రాట్ గా యశ్వంత్ మరియు భవానీగా నిరోషా నటిస్తున్నారు. అణకువ గల ఒక అమ్మాయి శ్రీవల్లి, మరియు అహంకార స్వభావం కలిగిన అబ్బాయి సామ్రాట్ ల మధ్య జరిగే సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మే నెల 2 వ తేదీన ప్రీమియర్ గా ప్రదర్శించబడే 'దేవతలారా దీవించండి` జీ తెలుగులో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారమవుతుంది.
జీవితమంతా ఉల్లాసభరితంగా ఉండాలని కోరుకునే ఒక సాధారణమైన అమ్మాయి శ్రీవల్లి. కాబట్టి జీవితంలో జరిగే ప్రతి విషయములోనూ మంచినే కనుక్కోవడానికి ప్రయత్నించే ఆమెలోని సానుకూల స్వభావం మనకు ఇందులో కనిపిస్తుంది. వాస్తవానికి, తన కుటుంబ సభ్యులే ఆమెను నష్టజాతకురాలిగా భావించిన తర్వాత కూడా, తనలాగా ఆలోచించే మంచి అందగాడు మరియు అర్థం చేసుకునే అబ్బాయిని పెండ్లి చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. అయితే దురదృష్టం వెక్కిరిస్తూ, తాను ఊహించిన కలల రాజకుమారుడు అనిపించేలా కనిపించిన సామ్రాట్ అనే అబ్బాయిని ఆమె కలుసుకుంటుంది. ఆమె అతనితో ప్రేమలో పడినప్పటికీ, అమ్మాయిలంటే గౌరవం లేని అతని స్వభావం ఆమె అతి త్వరగానే గ్రహిస్తుంది, వారిద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠత ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది! వాస్తవానికి, అతని తల్లి భవాని సైతమూ తన కొడుకు గురించి చాలా భయపడుతుంటుంది.
తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ చలనచిత్ర మరియు టీవీ రంగాల వ్యాప్తంగా 100 కు పైగా చిత్రాలలో నటించిన గతకాలపు తార నిరోషా కూడా, అనేక సంవత్సరాల తర్వాత 'దేవతలారా దీవించండి`తో తెలుగు ధారావాహికలకు తిరిగి తెరపైకి వచ్చింది. తన కొడుకు గురించి భయాందోళన చెందే నిరాడంబరమైన స్త్రీ అయిన భవాని పాత్రను ఆమె పోషించబోతోంది. ఆమె పాత్ర అనేక మలుపులతో ఉంటుంది, అయితే అది ప్రతి ఒక్కరి మనసులనూ కచ్చితంగా మెప్పించే ఆమె ఉత్తమ ప్రదర్శనగా ఉంటుంది.
ఈ సరికొత్త ధారావాహిక 'దేవతలారా దీవించండి` మే నెల 2 వ తేదీ నుండి సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కాబోతుంది, మరియు 'క్రిష్ణ తులసి` మే నెల 2 వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు.
కొత్త సీరియల్ యొక్క ప్రారంభం గురించి తెలుగు ఛీఫ్ కంటెంట్ అధికారి అనురాధా గూడూర్ మాట్లాడుతూ 'జీ తెలుగులో మేము, మా వీక్షకుల కోరికలను ముందువరుసలో ఉంచాలని ఎల్లప్పుడూ లక్ష్యంగా చేసుకుంటాము. వారికి మరింత వినోదాన్ని అందించడానికి మే నెల 2 వ తేదీన సరికొత్త ధారావాహిక - 'దేవతలారా దీవించండి` ని ప్రారంభిస్తున్నాము. ఈ సీరియల్ రెండు వేరు వేరు మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ, తన కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది` అని అన్నారు.
'దేవతలారా దీవించండి` సరికొత్త ధారావాహిక
మే నెల 2 వ తేదీన ప్రారంభం, సోమవారం నుండి శనివారం వరకు
ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మీ జీ తెలుగులో..