Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెజాన్ షేర్లు 14 శాతం పతనం
వాషింగ్టన్ : ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఒక్క పూటలోనే లక్షల కోట్లు నష్టపోయారు. శుక్రవారం సెషన్లో అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ఆయన కంపెనీ అమెజాన్ షేర్లు ఏకంగా 14 శాతం పతనమై 2,485.83 డాలర్లకు పరిమితమయ్యింది. దీంతో కొన్ని గంటల్లోనే బెజోస్ సంపద దాదాపు 20.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత కరెన్సీలో ఇది రూ.1.56 లక్షల కోట్లకు సమానం. ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్ ఫలితాలు మదుపర్లను నిరాశకు గురి చేశాయి. 2015 తర్వాత కంపెనీ తొలిసారి నష్టాల్ని నమోదు చేసింది. ఈ పరిణామంతో ఇన్వెస్టర్లు అమెజాన్ షేర్లను భారీగా అమ్మకానికి పెట్టడంతో విలువ పడిపోయింది.2022లో ఇప్పటి వరకు బెజోస్ సంపద 43 1 బిలియన్ డాలర్ల మేర తరిగిపోయి నప్పటికీ..ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.ఎలన్ మస్క్ 248 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.