Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెమా ఉల్లంఘనలపై ఇడి చర్యలు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీదారు షావోమి (ఎంఐ)కి చెందిన దాదాపు రూ.5,551 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. షోవోమి టెక్నలాజీ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ విదేశీ మారకం చట్టం(ఫెమా)నిబంధనల ఉల్లంఘించి నందున ఈ చర్యలు తీసుకున్నట్లు ఇడి శనివారం వెల్లడించింది.ఈ సంస్థ భారత్‌లో2014నుంచి కార్యక లాపాలు సాగిస్తోంది.దేశంలో వ్యాపారం ప్రారంభించి నప్పటి నుంచే విదేశీ మారకంలో ఆ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.దీంతో ఈ ఏడా ది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసినట్లు ఇడి పేర్కొంది. ఈ విషయమై షావోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్‌ను ప్రశ్నించింది. గత కొన్నేళ్లుగా షావోమి మూడు దేశాలకు రూ.5551.27 కోట్ల నిధులను అక్రమంగా తరలించిందని ఇడి పేర్కొంది. షావోమి గ్రూపునతో పాటు అమెరికాలోని రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయని తెలిపింది. ఆయా దేశాల్లోని సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలు పొందకుండానే ఈ నిధులను తరలించిందని పేర్కొంది.