Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యక్తిగత కొత్త వ్యాపారం (ఎన్బీ), వార్షిక ప్రీమియంతో సమానం (ఎపీఈ) 50% - ఏ సంవత్సరానికి ఆసంవత్సరం 50% వృద్ధి రేటుతో ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఇండియాఫస్ట్ లైఫ్) బలమైన వ్యాపార
విస్తరణ ప్రయాణాన్ని కొనసాగించింది. ఎన్బీ-ఎపీఈలో రూ. 1,345 కోట్లతో ఈ కంపెనీ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ జీవిత బీమా సంస్థగా నిలుస్తోంది.
కంపెనీ పనితీరుపై ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డిప్యూటీ సీఈఓ రుషబ్ గాంధీ మాట్లాడుతూ, “మా బలమైన వ్యాపార పనితీరుతో వరుసగా ఏడవ సంవత్సరం కూడా పరిశ్రమలో వేగవంతమైన వృద్ధిని కొనసాగించగలిగాం. ఆర్థిక సంవత్సరం 22లో మేము వ్యక్తిగత ఎన్బీ-ఏపీఈలో 50% వృద్ధి నమోదు చేసాము. మరింత సంతోషకరమైన విషయం ఏమిటంటే, మేము 07 సంవత్సరాలుగా CAGR 36% కలిగి ఉన్నాము, దీన్ని
మేము చాలా గర్వంగా భావిస్తాం. వరుసగా 4వ సారి కూడా భారత్‌లో పని చేసేందుకు అద్భుతమైన ప్రదేశంగా BFSI గ్రేట్
ప్లేసెస్ టూ వర్క్‌లో నిలవడం మా అంకితభావం, నైపుణ్యం, స్ఫూర్తిదాయక బృందపు అచంచలమైన శక్తికి నిదర్శనం” అన్నారు.
భారతదేశంలోని టాప్ 11 ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్లలో నిలిచేందుకు ఆర్థిక సంవత్సరం 22లో అన్ని ప్రధాన పారామితులలో కంపెనీ
ప్రశంసనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మా స్థూల ప్రీమియం ఆర్థిక సంవత్సరం 21లో 28% పెరిగి ఆర్థిక సంవత్సరం 22లో
రూ. 5,187 కోట్లు దాటింది. ఆర్థిక సంవత్సరం 22 కోసం ఇండియాఫస్ట్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఇతర ముఖ్యమైన
సంఖ్యలు:
- వ్యక్తిగత కొత్త వ్యాపార ప్రీమియం రూ.1428.7 కోట్లతో 55% వృద్ధి (ఆర్థిక సంవత్సరం 21: రూ. 924 కోట్లు)
- 82%తో 13వ-నెలవారీ పట్టుదల నిష్పత్తి (మార్చి 2021నాటికి : 78.7%)
- గ్రూప్ క్రెడిట్ లైఫ్ కొత్త వ్యాపార ప్రీమియంలో రూ.503.6 కోట్లతో 112% (ఆర్థిక సంవత్సరం: రూ. 238 కోట్లు)
- ప్రారంభించిన నాటి నుంచి మొదటిసారి రెన్యూవల్ ప్రీమియం ఆదాయం రూ.2,400 కోట్లు దాటింది.
- నిర్వహణలోని ఆస్తుల (ఎయూఎం) వృద్ధి 11% అంటే రూ.18,932 Crore (ఆర్థిక సంవత్సరం రూ.17,109 కోట్లు)
ఈ సంవత్సరంలో కొత్త ఉత్పత్తులు - ఇండియాఫస్ట్ లైఫ్ సరళ్ జీవన్ బీమా ప్లాన్, ఇండియాఫస్ట్ లైఫ్ సరళ్ పెన్షన్ ప్లాన్,
ఇండియాఫస్ట్ లైఫ్ సరళ్ బచత్ బీమా ప్లాన్, ఇండియాఫస్ట్ లైఫ్ ఈ-టర్మ్ ప్లస్ ప్లాన్, ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చ్యూన్ ప్లస్ వంటి
వాటి కంపెనీ తన ఉత్పత్తులను బలోపేతం చేసుకుంది. అవసరాలకు తగినట్టుగా ఇండియాఫస్ట్ లైఫ్ 46 విభిన్నమైన ఉత్పత్తులు
కలిగి ఉంది. మా వైవిధ్యభరితమైన పంపిణీ నెట్వర్క్, సాంకేతిక నైపుణ్యం సాయంతో దేశంలోని 98% పిన్‌కోడ్స్‌లో కస్టమర్లను
చేర్చుకోవడంతో పాటు వారికి సేవలందిస్తున్నాం.