Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న ఇంజనీరింగ్ సేవల సంస్థ క్వెస్ట్ గ్లోబల్ తన కొత్త లోగోను ఆవిష్కరించినట్టు ప్రకటించింది. ఈ కొత్త బ్రాండ్ లోగో తమ 25 ఏండ్ల కంపెనీ ప్రగతిని చూపిస్తుందని క్వెస్ట్ గ్లోబల్ ఛైర్మన్, సీఈఓ అజిత్ ప్రభు పేర్కొన్నారు. ఇది తమ ఖాతాదారులను మరింత కనెక్టివిటీ చేయడానికి దోహదం చేయనుందన్నారు. ఈ కొత్త అధ్యాయాన్ని వినయం, గర్వంతో స్వీకరిస్తున్నామన్నారు. తాము ప్రస్తుతం ప్రతీ వారము 125 మంది ఇంజనీర్లను తీసుకుంటున్నామన్నారు.