Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూర్స్ కంపెనీ వినూత్న వాహన బీమా పాలసీని ఆవిష్కరించింది. ప్రయాణించే దూరానికి మాత్రమే ప్రీమియం చెల్లిస్తే చాలని పేర్కొంది. ఇందుకోసం వాహనాలకు వన్ డామేజ్ సెక్షన్ కింద దూరం ఆధారిత బీమా 'పే యూజ్ యు డ్రైవ్'ను అందిస్తున్నట్టు వెల్లడించింది. బీమా ప్రీమియంపై ఆదా చేసుకునేందుకు గాను విలువ ఆదారితంగా నూతన కారు కొనుగోలు చేసే ఖాతాదారులకు మారుతి సుజుకిచే ప్రయోగాత్మకంగా ఈ ఆఫర్ అందిస్తున్నామని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ మోటార్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థనిల్ ఘోష్ తెలిపారు. దీని ద్వారా 10 నుంచి 20 శాతం నగదు ఆదా అవుతుందన్నారు.