Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఐడీబీఐ బ్యాంక్ నికర లాభాలు 35 శాతం పెరిగి రూ.691 కోట్లకు చేరాయి. మొండి బాకీలు, కేటాయింపుల భారం తగ్గడంతో మెరుగైన ఫలితాలు నమోదు చేసినట్టు ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.512 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ4లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.4,599.67 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,781.48 కోట్ల ఎన్ఐఐ నమోదయ్యింది. అయినప్పటికీ లాభాలు పెరగడం విశేషం. 2022 మార్చి నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 19.14 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే మార్చి నాటికి 22.37 శాతం ఎన్పీఏలు చోటు చేసుకున్నాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు రూ.36,21 కోట్ల నుంచి రూ.34,115 కోట్లకు తగ్గాయి.