Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జీ తెలుగు తన ప్రసారాలను ప్రారంభించినప్పటి నుంచి పలు వినోదాత్మక, ఆలోచలను రేకెత్తించే కార్యక్రమాలను ప్రసారం చేసింది. ఛానల్లో ప్రస్తుతం ప్రసారమవుతున్న ప్రైమ్ టైమ్ ఫిక్షన్ షోలు 'ప్రేమ ఎంత మధురం`, 'త్రినయని` తమకంటూ పూర్తిగా విభిన్నమైన కల్ట్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాయి. అలాంటి సీరియల్ లతో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మన జీ తెలుగు మహా సంగమం ఎపిసోడ్ లను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మే 2, 3వ తేదీలలో రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు 'ప్రేమ ఎంత మధురం`, 'త్రినయని`లు రెండు ఎపిక్ మహాసంగమం ఎపిసోడ్లను ప్రసారం చేసింది.
మహాసంగమం ఎపిసోడ్లో, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును అందజేస్తున్న ఒక అవార్డు ఫంక్షన్లో అవార్డు అందుకునేందుకు ముందు ఆర్య కొంత ఇబ్బంది పడుతూ ఉండడాన్ని నయని గమనించడాన్ని మనం చూస్తాము. అతన్ని రక్షించేందుకు ఆమె తన శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తుంది. విశాల్, నయని ఇద్దరూ ఆర్యకు సహాయం చేయగలరా లేదా అని తెలుసుకునే క్రమంలో ప్రేక్షకులు ఉత్కంఠకు గురవుతారు.
'ప్రేమ ఎంత మధురం`, 'త్రినయని`ల మహాసంగమం ఎపిసోడ్లలో ఉత్కంఠభరితమైన డ్రామాను మే 2, 3 తేదీలలో రాత్రి 8.30- 9.30 గంటల వరకు జీ తెలుగు ఛానెల్లో ప్రసారం చేశారు.