Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలోని అన్ని అగ్రశ్రేణి మొబైల్ రిటైల్ ఛైన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ), తమ మొదటి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించింది. ఓఆర్ఏ మొబైల్ రిటైలింగ్ ఛైన్స్ ద్వారా ఏర్పడిన ఒక సంస్థ, ఇది భాగస్వామ్య సంస్థల కోసం పని చేస్తుంది, వాళ్ళ అవసరాలు, ఆవశ్యకాలు, శిక్షణ, భాగస్వామ్యం లాంటి అంశాల్లో సాయపడుతుంది, మారుతున్న కాలానికి అనుగుణంగా, సాంకేతికతలో వేగాన్ని అందుకోడానికి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. దక్షిణ భారతదేశంలోని మొబైల్ రిటైలింగ్ ఛైన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ కొత్తగా ఏర్పడిన ఈ సంస్థ తొలి సమావేశం ప్రధానంగా మొబైల్ పరిశ్రమ వృద్ధి విషయంలో చర్చల మీదా, దాన్ని సాధించే దిశగా తీసుకోవలసిన చర్యల మీదా ప్రధానంగా దృష్టి సారించింది.
సంపన్నవంతమైన ఇ-కామర్స్ కంపెనీల ఆగమనం వాణిజ్యంలో గుత్తాధిపత్యం, విలక్షలతోకూడిన ఒక వాతావరణాన్ని సృష్టించింది, వ్యాపారాన్ని సున్నితంగా నడపడం కోసం, మనుగడ కోసం వివిధ స్థాయిల్లో తమ సమస్యలను తెలియజెప్పే ఒక సంస్థ మొబైల్ రిటైల్ పరిశ్రమకు ఉండడాన్ని ఆవశ్యకంగా ఇది మార్చింది. అదే ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) ఏర్పాటుకు దారి తీసింది, దీనికి శ్రీ టి.ఎస్. శ్రీధర్ అధ్యక్షుడిగా ఉన్నారు, నోకియా, జిల్లెట్ లాంటి పెద్ద కార్పొరేట్లతో సహా వివిధ సంస్థలకు చెందిన విక్రయాలు & పంపిణీ బృందాల్లో మూడు దశాబ్దాలకు పైగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.
కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా టి.ఎస్.శ్రీధర్, ఓఆర్ఏ అధ్యక్షుడు, మాట్లాడుతూ 'ఆన్లైన్ విక్రయాల వేదికలు అనుసరిస్తున్న గుత్తాధిపత్యంతో కూడిన వ్యాపార పద్ధతులు నైతికమైనవి, అవి దేశవ్యాప్తంగా సంప్రదాయిక పద్ధతుల్లో స్మార్ట్ ఫోన్లని విక్రయించే దాదాపు 1.5 లక్షల మంది రిటైలర్ల భవిష్యత్తును అల్లకల్లోలం చేస్తోంది. దక్షిణ భారతదేశంలో పెద్ద మొబైల్ రిటైలింగ్ ఛైన్స్ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ)ని మేము ప్రారంభించాం. నిర్దిష్టమైన మోడల్స్ ఆఫ్లైన్ విక్రయాలకు అందుబాటులో లేకపోవడం (ప్రత్యేకించిన ఆన్లైన్ మోడల్స్), ఆన్లైన్, ఆఫ్లైన్ విక్రయాల్లో ధరల వ్యత్యాసం, బ్యాంక్ సబ్వెన్షన్ ఛార్జీలు తదితర ప్రస్తుత సమస్యలకు సంభావ్యమైన పరిష్కారాలతో సహా కీలకమైన అంశాలను మేము చర్చించాం. మొబైల్ ఫోన్లను ఆవశ్యకమైన వస్తువుల విభాగంలోకి తీసుకువచ్చి, ప్రస్తుతం విధిస్తున్న జిఎస్టి మొత్తాన్ని తగ్గించాల్సిందిగా ప్రభుత్వాని కోరాలని కూడా సమావేశం నిర్ణయించింది` అని చెప్పారు.