Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగంలో కొత్తగా విద్యుత్ వర్షన్లో ఏస్ కార్గోను ఆవిష్కరించింది. ఒక్క సారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. గురువారం ఆవిష్కరణ సమయంలోనే పలు ఇ-కామర్స్, లాజిస్టిక్ సంస్థలతో విక్రయ ఒప్పందాలను కుదుర్చుకుంది. టాటా ఏస్ ధరను రూ.4 లక్షల నుంచి రూ.5.5 లక్షలుగా ఉండగా.. ఏస్ ఇవి ధరను రూ.6.5 లక్షలుగా నిర్ణయించింది. టాటా ఏస్ మినీ ట్రక్కును 2005లో విడదల చేసిన తర్వాత.. 17 ఏళ్ల తర్వాత దీన్ని ఇవిలో అందుబాటులోకి తేవడం విశేషం. కొత్త ఇవి ఏస్ కూడా ప్రభంజనం సృష్టించనుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.