Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఇష్యూ తొలి రెండు రోజుల్లోనే దాదాపుగా పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. గురువారం మార్కెట్లు ముగిసే సరికి 98 శాతం స్పందన లభించింది. పాలసీదారుల విభాగంలో 2.94 రెట్ల స్పందన చోటు చేసుకుంది. క్వాలిఫైడ్ ఇన్స్ట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) విభాగంలో 0.40 రెట్లు, నాన్ ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్స్‌లో 0.45 రెట్ల చొప్పున సబ్స్క్రయిబయ్యింది. ఈ నెల 9వ తేది వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉంటుంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్ ధరల శ్రేణీని రూ.902-949గా నిర్ణయించింది. ఎల్ఐసీలో 3.5శాతం వాటాలను మార్కెట్ శక్తులకు అమ్మకానికి పెడుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా సంస్థ విలువను అమాంతం తగ్గించి.. చౌకగా షేర్లను ప్రయివేటు శక్తులకు అప్పనంగా అమ్మేస్తుందని ఎల్ఐసి ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.