Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెపో రేటు 5.15 శాతానికి చేరొచ్చు
- ఆర్థిక నిపుణుల అంచనా
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో భవిష్యత్తులో క్రమంగా వడ్డీ రేట్ల పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా ముందు నాటి స్థాయికి 5.15 శాతానికి రెపోరేటును చేర్చే అవకాశం ఉందన్నారు. వచ్చే 12 మాసాల్లో రెపో రేటు 125-150 బేసిస్ పాయింట్లు పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.6 శాతంగా ఉండొచ్చని నొమురా చీఫ్ ఎకనామిస్ట్ సోనల్ వర్మ పేర్కొన్కారు. ఈ క్రమంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ధరలను తగ్గించడానికి ఆర్బీఐ క్రమంగా వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను కొనసాగించనుందని కాపిటల్ ఎకనామిస్ట్ విశ్లేషకుడు శైలన్ షా పేర్కొన్నారు.
పెంచేసిన రెండు బ్యాంక్లు..
ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచి ఒక్క రోజు కూడా కాకముందే.. బ్యాంక్లు ఆ భారాన్ని రుణగ్రహీతలపై మోపడాన్ని ప్రారంభించాయి. వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వేరువేరుగా ప్రకటించాయి. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఐ-ఈబీఎల్ఆర్)ను ఏడాదికి 8.10 శాతానికి చేర్చినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. కాగా బీఓబీ తానిచ్చిన రుణాలపై 40 బేసిస్ పాయింట్లు వడ్డీ పెంచినట్టు పేర్కొంది.