Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 13 శాతం శాఖలను మూసివేసే యోచనలో ఉందని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. నష్టాల్లో కొనసాగుతున్న దాదాపు 600 శాఖలను మూసివేయడం లేదా దగ్గరలోని శాఖల్లో విలీనం చేయాలని భావిస్తోందని పేర్కొంది. 2023 మార్చి ముగింపు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉందని వెల్లడించింది. దీంతో ఆర్థికంగా బలోపేతం కావాలని ఆ బ్యాంక్ భావిస్తోందని తెలుస్తోంది. 100 ఏళ్ల పైబడి చరిత్ర కలిగి.. సేవలందిస్తున్న సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుతం 4,594 శాఖలను కలిగి ఉంది.