Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ ఉత్పత్తి ఫోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించినట్టు ప్రకటించింది. తెలంగాణ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ కొత్తగా డబుల్ టోన్డ్ ఏ2 బఫెలో మిల్క్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపింది. 500 మిల్లీ లీటర్ల ధరను రూ.40గా నిర్ణయించినట్టు తెలిపింది. హైదరాబాద్‌లో తొలుత అందుబాటులోకి తెచ్చిన ఈ వేరియంట్‌ను త్వరలోనే మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. కేలరీల పట్ల అమిత శ్రద్ధ చూపడంతో పాటుగా డైటరీ నిబంధనలు అనుసరించే వారిని లక్ష్యంగా చేసుకుని దీనిని విడుదల చేశామని సిద్స్ ఫార్మ్ ఫౌండర్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి తెలిపారు.