Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమ ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీలో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నేడు తాము తమ నెట్‌వర్క్‌కు గత రెండు సంవత్సరాల కాలంలో 1000కు పైగా నూతన శాఖలను జోడించినట్లు వెల్లడించింది. ఈ మహమ్మారి కాలంలో బ్యాంక్ ప్రతి రోజూ రెండు నూతన శాఖలను ప్రారంభించింది. ఒక్క 2022 ఆర్ధిక సంవత్సరంలోనే 734 శాఖలను ఇది తెరిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇప్పుడు నూతన రికార్డును ఏకకాలంలో భారతదేశ వ్యాప్తంగా గరిష్టంగా బ్యాంక్ శాఖలను ప్రారంభించడం ద్వారా సృష్టించింది. మార్చి 31,2022న దేశ వ్యాప్తంగా 250 శాఖలను డిజిటల్‌గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ – సీఈఓ శ్రీ శశి జగదీషన్ ప్రారంభించారు. ఈ రికార్డును అధికారికంగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయి. మార్చి 31,2022 నాటికి ఈ బ్యాంక్ యొక్క పంపిణీ నెట్వర్క్ లో 6432 శాఖలు మరియు 18,130 ఏటీఎంలు భారతదేశ వ్యాప్తంగా 3,188 నగరాలు/పట్టణాలలో ఉన్నాయి. ఈ బ్యాంక్ గతంలో తమ శాశ్వత ఉద్యోగుల సంఖ్యను 90%కు వృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. మార్చి31,2022 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,41,579గా నిలిచింది. దేశవ్యాప్తంగా విస్తృతశ్రేణిలో శాఖలను తెరవడంతో బ్యాంకు ఇప్పుడు తమ ఉనికిని విస్తరించుకోవడంతో పాటుగా తమ వ్యాపారాన్ని కూడా విస్తరించడం వీలయింది. వినియోగదారులను సొంతం చేసుకోవడంలో అత్యంత కీలకమైన కేంద్రాలుగా శాఖలు నిలుస్తుంటాయి. రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ గత కొద్ది సంవత్సరాలుగా గణనీయంగా వృద్ధి చెందుతుంది. ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ లో భాగంగా ఈ బ్యాంక్ యొక్క పరివర్తక ప్రయాణం ‘వినియోగదారునిపై దృష్టి పెట్టండి’ అనే తమ ఫౌండేషనల్ లక్షణంను ప్రదర్శిస్తోంది.
‘‘రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కళకు మరింత సైన్స్ జోడించడం ద్వారా ఈ ఛానెల్‌ను పునరావిష్కరించడం మా శాఖల బ్యాంకింగ్ వ్యూహం లో భాగం’’ అని శ్రీ అరవింద్ వోహ్రా, కంట్రీ హెడ్, రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అన్నారు. ‘‘మా శాఖలు బ్యాంకును మా వినియోగదారులు, సమాజం మరియు ఇతర వాటాదారులకు చేరువ చేస్తాయి మరియు అవి రిటైల్ మరియు బిజినెస్ కస్టమర్ సంబంధాలను కలిగి ఉంటాయి. మేము మా శాఖలను ఫిజిటల్ మౌలిక వసతుల ఎస్సెట్స్‌గా మారుస్తున్నాము. సంస్ధాగత స్ధిరత్వం తో క్యాచ్మెంట్ స్కోపింగ్ మరియు మైనింగ్ ద్వారా మేము వినియోగదారుల కేంద్రీకృత సంభాషణలకు నాయకత్వం వహిస్తున్నాము. దీనిని మా అత్యాధునిక ఐటీ మౌలిక వసతులు, కృత్రిమ మేథస్సు ఆధారిత ఊహాజనిత విశ్లేషణలతో సాధ్యం చేస్తున్నాము. నూతన వినియోగదారులను పొందడంలో అత్యంత కీలకంగా శాఖలు ఉంటాయని నమ్ముతున్నాము. ఇవి అత్యున్నత శ్రేణి అనుభవాలను అందించడంతో పాటుగా భారీ స్థాయిలో వాలెట్‌ను పొందేందుకు, వినియోగదారుల లాయల్టీ నిర్మించేందుకు తోడ్పడుతుంది. దాదాపు సగానికి పైగా మా శాఖలు సెమీ అర్బన్ మరియు గ్రామీణప్రాంతాలలో ఉన్నాయి. మేము స్ధిరంగా బ్యాంక్ యొక్క చేరికను కొనసాగించడంతో పాటుగా సమ్మిళిత వృద్ధికి మద్దతును కొనసాగించనున్నాము’’ అని అన్నారు.
బ్యాంక్ శాఖల కోసం కీలకమైన వ్యూహాత్మక డ్రైవర్లు :
సంపూర్ణమైన వినియోగదారుల జీవిత చక్ర నిర్వహణ
విశ్లేషణల ఆధారిత వినియోగదారుల సంభాషణ మరియు పంపిణీ ప్లానింగ్ టూల్
అమ్మకాలు, సేవలు మరియు శాఖల కార్యకలాపాల డిజిటైజేషన్
కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్‌లెన్స్
ప్రజల సామర్ధ్యం
తమ విస్తరణ కోసం అతి ప్రధానమైన తోడ్పాటునందిస్తూ ఈ బ్యాంక్ ఇప్పుడు 90%కు పైగా తమ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మలుస్తుంది. అత్యధికంగా 13వేల మందిని బ్యాంక్ యొక్క విస్తృత శ్రేణి డెలివరీ ఛానెల్స్ – బ్రాంచ్ బ్యాంకింగ్ ;టెలి సర్వీసెస్/సేల్స్ (వర్ట్యువల్ రిలేషన్షిప్ మేనేజర్ ఛానెల్ సహా) ; బిజినెస్ వర్టికల్స్‌కు అనుగుణంగా సేల్స్ ఛానెల్స్ ; డిజిటల్ మార్కెటింగ్. ఈ ఛానెల్స్ అన్నీ కూడా బ్యాంకు తుదికంటూ చేరుకునేందుకు సహాయపడటంతో పాటుగా దేశం నలుమూలలా విస్తరించేందుకు తోడ్పడుతుంది.
భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఋణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్. ఏప్రిల్ 2021లో ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ కింద సంస్ధాగత మార్పులను బ్యాంకు ప్రారంభించడం ద్వారా తమ తరువాత దశ వృద్దికి శ్రీకారం చుట్టింది. ఈ బ్యాంకు స్పష్టంగా వ్యాపార పరంగా మూడువిభాగాలు, డెలివరీ ఛానెల్స్ మరియు ఈ మూడు అంశాలలో టెక్నాలజీ/డిజిటల్ పరంగా మరింతగా నిర్మించడం తో పాటుగా భవిష్యత్‌కు సిద్ధంగా ఉండటం ఉన్నాయి. లక్ష్యిత వ్యాపార విభాగాలు మరియు డెలివరీ ఛానెల్స్ సృష్టి రాబోయే కాలంలో కస్టమర్ సెగ్మెంట్లలోని అవకాశాలను ఉపయోగించుకునేలా చేస్తుంది.