Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సుప్రసిద్ధమైన గుఫిక్ బయోసైన్సెస్ లిమిటెడ్ (గుఫిక్) తమ కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి వినూత్నమైన, పరిశోధనాధారిత ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను తీర్చిదిద్దడంలో ముందుంది. తొలిసారిగా చెప్పబడే ఎన్నో ఔషదాల రూపకల్పనలో ఖ్యాతి గడించిన సంస్థ తమ కీరి ్తకిరీటంలో మరో కలికితురాయిని జోడించుకుంటూ ఇటీవలనే సెంట్రల్ లైసెన్సింగ్ అప్రూవింగ్ అథారిటీ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి ఇసావుకొనాజోనియం సల్ఫేట్ ఏపీఐ మరియు ఇంజెక్షన్ 200ఎంజీ వయల్ కోసం ఫినీష్డ్ ఫార్ములేషన్ ఇసావుకొనజోల్ తయారీ, అమ్మకం, పంపిణీ కోసం అనుమతులు పొందింది. మ్యుకోర్మైకోసిస్ మరియ అస్పెర్జిల్లోసిస్ చికిత్స కోసం 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు వినియోగించడానికి సూచించడమైనది.
కోవిడ్–19 సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు అయినటువంటి అస్పెర్గిల్లోసిస్ మరియు మ్యుకోర్మైకోసిస్ తో బాధపడుతున్న రోగులకు చికిత్సనందించడంలో తోడ్పడనున్న గుఫిక్ బయోసైన్సెస్ ఇసావుకొనజోల్
గుఫిక్ బయోసైన్సెస్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వై నగేష్ మాట్లాడుతూ ‘‘ఇసావుకోనజోల్ అనేది ట్రయాజోల్ తరగతికి చెందిన యాంటీ ఫంగల్ డ్రగ్. దీనిని ఇప్పటికే యుస్ –ఎఫ్‌డీఏ మరియు యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీలు అనుమతించాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. కోవిడ్–19 కాలంలో మ్యుకోర్మైకోసిస్ కేసులు గణనీయంగా పెరిగాయి. అలాంటి వారికి ఇసావుకొనజోల్ ఓ వరంలా నిలుస్తుంది’’ అని అన్నారు.
మెడికల్ ఎఫైర్స్ జనరల్ మేనేజర్ డాక్టర్ ఆదర్శ్ శెట్టి మాట్లాడుతూ ‘‘కోవిడ్ –19 ద్వితీయ వేవ్ భారతదేశంలో భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. కోవిడ్–19 రోగులలో మ్యుకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వ్యాధి అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. ఈ వ్యాధి చికిత్సకు పరిమిత ఔషదాలు మాత్రమే ఉన్నాయి. ఈ తరహా రోగులకు ప్రాణ రక్షణగా ఇసావుకొనజోల్ వచ్చింది’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘మ్యుకోర్మైకోసిస్ లేదా అస్పెర్గిల్లోసిస్ సాధారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తులు లేదా అనారోగ్యంతో బాధపడిన వ్యక్తులకు వస్తుంటాయి. ఈ రెండు వ్యాధులూ ప్రాణాంతికమైనవి. దాదాపు 90% మంది మరణించేందుకు అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా పోలిస్తే భారతదేశంలో ఇది 70 రెట్లు అధికం. మధుమేహం అనేది అతి సాధారణ రిస్క్ ఫ్యాక్టర్‌గా నిలుస్తుంటుంది. దీనితో పాటుగా అవయవ మార్పిడి రోగులలో కూడా ఇది కనిపిస్తుంది’’ అని అన్నారు.