Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : మైక్రో బ్లాగింగ్ దిగ్గజ సోషల్ మీడియా అయినా ట్విట్టర్‌కు తాత్కాలికంగా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా టెస్లా అధినేత ఎలన్ మస్క్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. రూ.33 లక్షల కోట్లతో ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ అధికారికంగా పూర్తి కాగానే.. మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయని రాయిటర్స్ తెలిపింది. మస్క్ ఇప్పటికే టెస్లా, బోరింగ్ కంపెనీ, స్పేస్ఎక్స్ సంస్థలకు సీఈఓగా ఉన్నారు. కాగా.. కొనుగోలు ఒప్పందం పూర్తి అయ్యే వరకు పరాగ్ కొనసాగనున్నారు. మస్క్ బాధ్యతలు తీసుకుంటే టెస్లాపై ఆయన దృష్టి తగ్గొచ్చనే అంచనాల్లో మదుపర్లు ఆ కంపెనీ షేర్ల అమ్మకాలకు మొగ్గు చూపడంతో గురువారం టెస్లా షేర్ 8 శాతానికి పైగా నష్టపోయింది.
పెట్టుబడులకు పలువురి ఆసక్తి..
ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఎలన్ మస్క్‌కు పలువురు పారిశ్రామికవేత్తలు నిధులు సమకూర్చడానికి ముందుకు వచ్చారు. ఒరాకిల్ గ్రూప్ కో ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్, సెకోయా క్యాపిటల్ సంస్థలు 7.14 బిలియన్ డాలర్ల నిధులు అందించడానికి అంగీకరించాయి. అరేబియా యువరాజు అల్వాలీద్ బిన్ తలాల్ వంటి 1.89 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ముందుకు వచ్చారు. ఇదే విషయాన్ని ఎలన్ మస్క్ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపారు. ఈ ప్రతిపాదనలతో ఎలన్‌మస్క్ తీసుకోనున్న రుణం 12.5 బిలియన్ల డాలర్ల నుంచి 6.25 బిలియన్ల డాలర్లకు తగ్గనుంది.
విద్వేషాలను కట్టడి ఎలా..? : బిల్‌గేట్స్
ట్విట్టర్‌ను నిర్వహించడం అంత సులువు కాదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. మస్క్ దగ్గర మంచి ఇంజనీర్లు, టెక్నిషియన్లు ఉండవచ్చు.. కానీ టెస్లా, స్పేస్‌ఎక్స్‌లను నిర్వహించినంత సులభంగా సామాజిక వేదికను నడిపించడం వీలుకాదని పేర్కొన్నారు. అలాగని ఇప్పటికయితే ట్విటర్ గాడి తప్పుతుందని తాను భావించడం లేదన్నారు. ఖాతాదారులకు స్వేచ్ఛాగా భావాలను అందిస్తామని ఎలన్ మస్క్ పేర్కొన్నారని.. కానీ.. ఫ్రీ స్పీచ్ ముసుగులో వచ్చే ద్వేషపూరిత వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాన్ని ఎలా అరికడతారంటూ ప్రశ్నించారు. విద్వేశాలను ఆపే విధానం ఎలా ఉంటుందో వేచి చూడాలన్నారు.