Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టెక్స్టైల్ రంగంలోని జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ అనుబంధ సంస్ధ జిందాల్ మొబిల్టిక్ర్ తాజాగా ఎర్త్ ఎనర్జీ ఈవీని సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది. దీనితో జిందాల్ మొబిల్టిక్ర్ ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వేదికతో పాటుగా ఎర్త్ ఎనర్జీ బ్రాండ్లు అయిన గ్లైడ్ ఎస్ఎక్స్, గ్లైడ్ ఎస్ఎక్స్ వేరియంట్ కమ్యూటర్ స్కూటర్లుతో పాటుగా ఇవాల్వ్ ఆర్, ఇవాల్వ్ ఎస్ కమ్యూటర్, క్రూయిజర్ మోటర్ సైకిల్స్ తదితర వాటిని తన పోర్టుపోలియోలో చేర్చుకున్నట్లయ్యిందని తెలిపింది. ముంబయి కేంద్రంగా ఆటోమోటివ్ స్టార్టప్ ఎర్త్ ఎనర్జీ ఇవి పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు కలిగి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జిందాల్ పరిధిలోకి రానున్నాయి.