Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ, మే 08, 2022 : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండస్ట్రీ ఎక్స్లెన్స్ అవార్డులు ఐదవ ఎడిషన్ ఇండియా ఎనర్జీ స్టోరేజీ అలయ్స్ (ఐఈఎస్ఏ) వద్ద తమ నూతన ఎనర్జీ వ్యాపార అధ్యక్షుడు విజయానంద్ సముద్రాల కు సీఎక్స్ఓ ఆఫ్ ద ఇయర్ అవార్డు మరియు దాని ఆర్ అండ్ డీ– లి– అయాన్ హెడ్ డాక్టర్ వెంకటేశ్వర్లు మన్నెకు రీసెర్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎనర్జీ స్టోరేజీ విభాగంలో అందజేసినట్లు అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ (ఏఆర్బీఎల్) వెల్లడించింది.
ఎనర్జీ స్టోరేజీ మరియు ఈ మొబిలిటీ కి సంబంధించి భారతదేశపు అగ్రగామి భాగస్వామ్యం ఐఈఎస్ఏ. దీనిని 2012 ప్రారంభించారు. ఈ సంవత్సరం అవార్డుల వేడుకకు ముఖ్యఅతిథిగా రోడ్డు రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
ఏఆర్బీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌమినేని మాట్లాడుతూ 'అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదిక వద్ద ఈ గుర్తింపు పొందడం పట్ల మొత్తం అమరరాజా కుటుంబం ఈ మైలురాయి పట్ల గర్వంగా ఉంది. మా బృందాలకు తగిన సాధికారిత కల్పించడమనేది అమర రాజా డీఎన్ఏలో అంతర్భాగం. ఎప్పుడూ అత్యుత్తమమైన పనులు చేయడానికి మెరుగైన మార్గాన్ని కనుగొనాలనే మా అవిశ్రాంత ప్రయత్నాలకు నిదర్శనంగా ఈ గుర్తింపు లభిస్తుంది` అని అన్నారు