Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డా. అగర్వాల్స్ హెల్త్ కేర్ రూ.1,050 కోట్ల నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని టీపీజీ గ్రోత్ అండ్ టెమాసెక్ నుంచి సేకరించినట్లు పేర్కొంది. దేశంలోనే ఈ పెట్టుబడి మొత్తం నేత్ర సంరక్షణా రంగంలో అతిపెద్ద నిధుల సేకరణగా నమోదయ్యిందని తెలిపింది. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న 105 ఆస్పత్రులను రెండింతలు చేసి.. వచ్చే 3-4 ఏండ్లలో 200 ఆస్పత్రులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ 2019లోనూ టెమాసెక్ నుంచి రూ. 270 కోట్ల నిధులను సేకరించింది.