Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కొత్త ప్రెసిడెంట్గా ఇన్ఫోసిస్, హైదరాబాద్ సెజ్ అధిపతి మనీషా సాబు ఎన్నికయ్యారు. ఓ మహిళకు తొలిసారి ఈ బాధ్యతలు దక్కడం విశేషం. హైసియా 30వ సర్వసభ్య సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో మనీషాకు 20 ఏండ్ల అనుభవం ఉంది. 2022-24 కాలానికి హైసియా ప్రెసిడెంట్ బాధ్యతలను నిర్వహిస్తారు. జనరల్ సెక్రెటరీగా ఆరోప్రో సాఫ్ట్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ రామకష్ణ లింగిరెడ్డి ఎన్నికయ్యారు.