Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్, 11 మే 2022: పరిశ్రమలో మొదటి ప్రయత్నంగా, సుజుకి మోటార్ కార్పొరేషన్, జపాన్ (SMC), మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) మరియు ఐఐటి హైదరాబాద్ (IITH) ఫ్యూచరిస్టిక్ V2X (వాహనం నుంచి ప్రతి ఒక దాన్నీ) కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా భారతదేశ-నిర్దిష్ట వాహన వినియోగ పరిస్థితులను పరిశోధించేందుకు జతకట్టాయి. తగిన మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నిబంధనలు, మరియు డ్రైవర్‌కు ఉన్న నైపుణ్యాలతో కలిపి వి2ఎక్స్ (V2X) కమ్యూనికేషన్స్ టెక్నాలజీని ఉపయోగించినప్పుడు, ట్రాఫిక్ ఉన్నప్పుడు చోటు చేసుకునే సంఘటనలు రహదారిపై రద్దీని తగ్గించేందుకు సాధ్యమవుతుంది.
ఈ అప్లికేషన్లను ప్రదర్శించే మొదటి ప్రోటోటైప్లను నేడు ఇక్కడి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రదర్శించారు. భారత ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సలహాదారు మునిశేఖర్ అవిలేలి; భారత ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (స్టాండర్డైజేషన్- ఆర్&డి-ఇన్నోవేషన్), వై.జి.ఎస్.సి. కిషోర్ బాబు, భారత ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, డైరెక్టర్ (వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్) వి.జె.క్రిస్టోఫర్, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఐటి శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ (ఐఏఎస్)లకు 5 వాహన వినియోగ సందర్భాలను ప్రదర్శించారు. ఐఐటిహెచ్ నుంచి చైర్మెన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి మరియు ఐఐటిహెచ్ డైరెక్టర్ డాక్టర్ బి ఎస్ మూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాంకేతిక డిమాన్స్ర్టేషన్లో జపాన్‌లోని సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కజునోబు హోరీ, మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తరుణ్ అగర్వాల్, మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి పాల్గొన్నారు.
ప్రదర్శించబడిన కొన్ని వినియోగ సందర్భాలు ఇలా ఉన్నాయి:
• అంబులెన్స్ హెచ్చరిక వ్యవస్థ: కారుకు చేరువ అవుతున్న ఎమర్జెన్సీ వాహనం మరియు దాని ప్రయాణ మార్గానికి సంబంధించి డ్రైవర్లను V2X కమ్యూనికేషన్ అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ సురక్షితంగా తమ మార్గానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకుని అత్యవసరంగా వెళ్లవలసిన వాహనానికి మార్గాన్ని కల్పించేందుకు అవకాశం కలుగుతుంది. అలర్ట్ సిస్టమ్ రియల్ టైమ్ ప్రాతిపదికన వాహనాల మధ్య ఎన్ని నిమిషాల దూరం తదితర నిమిషాల వివరాలను కూడా పంచుకుంటుంది.
• రాంగ్-వే డ్రైవర్ అలెర్టింగ్ సిస్టమ్: తప్పు మార్గంలో వస్తూ తమకు ఎదురుగా వచ్చే డ్రైవర్ ఉనికికి సంబంధించి V2X కమ్యూనికేషన్‌ని ముందస్తు హెచ్చరికలు చేస్తుంది.
• పాదచారుల హెచ్చరిక వ్యవస్థ: V2X కమ్యూనికేషన్‌ని ఉపయోగించి, కారుకు అడ్డుగా వచ్చి ఢీకొనే అవకాశం ఉన్న సమీపంలోని పాదచారుల గురించి డ్రైవర్లకు ఈ అలర్ట్ అప్రమత్తం చేస్తుంది. పాదచారులను ఢీకొట్టకుండా డ్రైవర్లు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఇది సహకరిస్తుంది.
• మోటార్‌సైకిల్ అలర్ట్ సిస్టమ్: కారు డ్రైవర్లు బ్లైండ్ స్పాట్ నుంచి వేగంగా వచ్చి ఢీకొనే అవకాశం ఉన్న, 2-వీలర్ల గురించి V2X కమ్యూనికేషన్ ద్వారా తెలుసుకుంటారు. ఆ వాహనం దూరం మరియు దిశకు సంబంధించిన విధానాల గుర్తించి డ్రైవర్ రియల్-టైమ్‌లో షేర్ చేయబడుతుంది.
• రోడ్ కండిషన్ అలర్ట్ సిస్టమ్: పాడైన రహదారి పరిస్థితుల గురించి కారు డ్రైవర్ హెచ్చరికను అందుకుంటాడు మరియు ప్రయాణంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లమని డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.
• కారును కంప్యూటర్‌గా : కారును డ్రైవింగ్‌కు ఉపయోగించనప్పుడు, కారును వినియోగించే వారు, కారులోని మైక్రోప్రాసెసర్‌ను కంప్యూటింగ్ సామర్థ్యాలకు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఇది పూర్తిగా భారతీయ అవసరాలకు V2X కమ్యూనికేషన్ టెక్నాలజీతో కలిగే ప్రయోజనాలను అధ్యయనం చేసేందుకు ఒక ఆవిష్కారాత్మక ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. భవిష్యత్తులో వినూత్న సాంకేతికతలపై సాధ్యమయ్యే పరిష్కారాలు మరియు వినియోగ కేసుల శ్రేణిని ఈ డిమాన్స్టరేషన్ అందించింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి ప్రణాళికతో ఎలాంటి సంబంధం లేదు.