Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హోమ్ ఇంటీరియర్ సొల్యూషన్స్ (గృహాలంకరణ ఉత్పత్తుల)లో భారతదేశపు అగ్రగామి బ్రాండ్లలో ఒకటైన డిజైన్‌కేఫ్ హైదరాబాద్‌లో తమ `ఎక్స్పీరియన్స్ సెంటర్` రెండవ శాఖను ... మహానగరానికి తలమానికమైన బంజారాహిల్స్ లో ప్రారంభించింది. ఇందులో 45 వేలకు పైగా గృహాలంకరణ సామగ్రిని విస్తృత స్థాయిలో ప్రదర్శిస్తున్నట్టు కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ప్రతి కుటుంబానికీ ఉపయోగపడేలా ... ప్రపంచస్థాయి గృహోపకరణాలను ఇక్కడ అందుబాటులో వుంచామని తెలిపింది. గచ్చిబౌలి లోని తమ మొదటి శాఖతో సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, బంజారాహిల్స్‌తో పాటు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లోని కస్టమర్లకూ సేవలందించేందుకు డిజైన్‌కేఫ్ సిద్ధమవుతోంది. తమ ప్రత్యేక హోమ్ ఇంటీరియర్ సొల్యూషన్స్‌ను హైదరాబాద్ నగరమంతటా కూడా అందుబాటు లోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది.
బంజారాహిల్స్ లోని రాయ్ చందాని కన్స్ట్రక్షన్ భవనంలో, 2500 చదరపు అడుగుల విశాలమైన డిజైన్‌కేఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ విజయవంతంగా నడుస్తోంది. డిజైన్‌కేఫ్ తమ విలువైన వినియోగదారుల కోసం ఇక్కడ పలు విభిన్నమైన, వైవిధ్యమైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. 2.5 BHK షో ఫ్లాట్‌కి గోల్డ్ పానెలింగ్ ఆప్షన్స్ మొదలుకొని, వార్డ్ రోబ్ లకు, లివింగ్ & డైనింగ్ ఏరియాలకు ప్రత్యేక ప్రదర్శనా విభాగాలు, అద్భుతంగా రూపొందించిన మూడు మాడ్యులర్ కిచెన్ డిజైన్లు కూడా ప్రదర్శనలో వున్నాయి. అలాగే, వినియోగదారులు ఆధునిక పద్ధతుల్లో తమ స్థలం ఆదా చేసుకునేలా విస్తృతమైన స్టోరేజ్ డిజైన్లు కూడా ఇక్కడ లభ్యంగా వున్నాయి. మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్లన్నీ బెంగుళూరులోని 35000 చదరపు అడుగుల విశాలమైన డిజైన్‌కేఫ్ అత్యాధునిక (స్టేట్ అఫ్ ది ఆర్ట్) ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఇక కంపెనీ తమ సేవల్లో భాగంగా ... ప్రతి వినియోగదారునికీ అన్ని తరహాల ఉత్పత్తులపై 10 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. అలాగే, ఉత్పత్తుల విక్రయానంతర సేవల్ని కూడా హామీతో అందిస్తోంది.
కంపెనీ విస్తరణ వివరాలను మీడియాకి, వినియోగదారులకి తెలియజేస్తూ, డిజైన్‌కేఫ్ సిఇఓ & సహ వ్యవస్థాపకులు గీతా రమణన్ హర్షం వ్యక్తం చేశారు. “డిజైన్‌కేఫ్ కొత్త శాఖలకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ... ‘అందరికీ అందుబాటులో డిజైనర్ ఇళ్ళు’ అనే డిజైన్‌కేఫ్ లక్ష్యానికి పటిష్టమైన పునాదిరాయి పడినట్లు భావిస్తున్నాం`` అన్నారు. ప్రతి భారతీయ ఇంటి యజమానికీ అత్యంత నాణ్యమైన పలు ఉత్పత్తులను అందించేందుకు తాము చేసిన అవిశ్రాంత కృషికి ఇప్పుడు మంచి గుర్తింపు లభిస్తోందన్నారామె. హైదరాబాద్ ప్రజలంతా కూడా తమకు సమీపంలోని డిజైన్‌కేఫ్ శాఖల్లో అందుబాటు ధరల్లో లభించే, నాణ్యమైన గృహాలంకరణ ఉత్పత్తులను ఒకేచోట ఎంపిక చేసుకొని, కొనుగోలు చేసే సౌలభ్యం పొందగలుగుతారని ఆమె తెలిపారు. సృజనాత్మక విధానానికి కళాత్మకతను జోడిస్తూ, స్థలం ఆదా చేసే మా స్టోరేజ్ డిజైన్లు హైదరాబాదీలందరికీ నచ్చుతాయనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో రెండవ శాఖగా, బంజారాహిల్స్‌లో ప్రారంభమైన డిజైన్‌కేఫ్ భాగస్వామి, ఫ్రాంచైసీ యజమాని రాధికా చెరుకూరితో కలిసి ఎక్స్పీరియన్స్ సెంటర్ రెండవ శాఖను ప్రారంభించడం తమకెంతో ఆనందాన్నిస్తోందని గీతారమణన్ పేర్కొన్నారు. అభిరుచి, సమర్థత కలిగిన నిపుణులకు అవకాశాలను అందించి, వారి ప్రస్థానంలో విజయం సాధించేలా ప్రోత్సహించాలనే తమ లక్ష్యానికి ఇదొక ముందడుగు అన్నారామె. రాధిక డిజైన్‌కేఫ్ కస్టమర్లకు అద్భుతమైన సేవలను అందిస్తూ, ఈ శాఖను ఉన్నత స్థాయిలో నిలుపుతారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. డిజైన్‌కేఫ్ సిఇఓ & సహ వ్యవస్థాపకులు షేజాన్ భోజాని మాట్లాడుతూ “హైదరాబాద్ లో డిజైన్‌కేఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రెండవ శాఖను ప్రారంభించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. గృహాలంకరణ, ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్ సొల్యూషన్స్ విషయంలో హైదరాబాద్ వినియోగదారులకు స్పష్టమైన అభిరుచి వుంది. గత నలభై ఏళ్ళలో ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగం గజానికి 50 రూపాయలనుండి 5 లక్షల రూపాయలకు దూసుకెళ్లింది. తద్వారా స్థిరాస్తి రంగంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారంతో, ఇండియాలో ముంబై తర్వాత హైదరాబాద్ రెండవస్థానంలో నిలిచింది. మేము కూడా ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా వున్నాం. 2022 లో బంజారాహిల్స్‌లో100 గృహాలకు ఇంటీరియర్ డిజైన్లను అందించే లక్ష్యాన్ని సాధించి, ఈ కొత్త శాఖ మా కంపెనీ అబివృద్ధి లో ముఖ్య భూమిక పోషించగలద” ని ఆశాభావం వ్యక్తం చేశారు.”
బంజారాహిల్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భారతదేశంలో డిజైన్ కేఫ్ వారి పదవ శాఖ. ప్రతి భారతీయ కుటుంబపు ‘డ్రీం హోం’ కలను సాకారం చేయడానికి, తమ 25 ఎక్స్పీరియన్స్ సెంటర్ల ద్వారా సేవలందించడానికి, డిజైన్‌కేఫ్ కట్టుబడివుంది. పూణే, నవి ముంబై తో పాటు ఇంకొన్ని నగరాలలో కూడా ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కంపెనీ సొంతమైనవి, ఫ్రాంచైజింగ్ ద్వారా ఏర్పాటు చేసేవి అనే రెండు మార్గాల్లో పాన్-ఇండియా స్థాయిలో డిజైన్కేఫ్ను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో డిజైనర్, బంజారాహిల్స్ డిజైన్‌కేఫ్ ఫ్రాంచైజీ ఓనర్ రాధికా చెరుకూరి మాట్లాడుతూ, “ఈ కొత్త శాఖ ద్వారా హైదరాబాద్‌లో మరింతమంది కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యతతో, వైవిధ్యమైన డిజైన్లను అందించడానికి మాకు అవకాశం దొరుకుతుంది. మా డిజైన్లు ఉన్నత విలువలతో, హుందాతనంతో, సరికొత్త ట్రెండ్‌తో, ఆధునిక జీవనశైలికి అనుగుణంగా వుంటాయి. అంతేకాదు, ఇవన్నీ, మా కస్టమర్లు ప్రతిరోజూ తమ ఇంటితో ప్రేమలో పడే విధంగా తయారుచేశాం. రానున్న కొన్ని నెలల సమయం నాకు ఎంతో ఉత్సాహపూరితంగా వుండనుంది. ఈ రంగంలో డిజైన్‌కేఫ్ లాంటి సుప్రసిద్ధ బ్రాండ్‌తో కలిసి నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం నా కల. అదీకాక బంజారాహిల్స్ లాంటి అత్యుత్తమ వాణిజ్య ప్రాంతంలో నా కొత్త ప్రయాణం ఆరంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు. ప్రతి కస్టమర్ కు తమ అభిరుచికి, అవసరాలకు తగిన ఉత్పత్తులను అందించేలా, ఈ సెంటర్లో ఇన్-హౌస్ డిజైనర్లు, డిజైన్ పార్టనర్లు, సేల్స్ మేనేజర్లను నియమించనున్నారు. బంజారాహిల్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ చిరునామా: రోడ్ నెంబర్. 12, 3వ ఫ్లోర్, రాయ్ చందాని కన్స్ట్రక్షన్ బిల్డింగ్, శ్రీరామ్ నగర్ కాలనీ, బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ - 500034.
డిజైన్‌కేఫ్ గురించి మరికొన్ని విషయాలు:
వినూత్న గృహాలంకరణ సేవలను అందుబాటు ధరల్లో అందించే లక్ష్యంతో డిజైన్‌కేఫ్ 2015 లో ప్రారంభమైంది. 2015 అక్టోబర్ లో అవార్డు విజేతలైన ఆర్కిటెక్టులు గీతా రామన్, షేజాన్ భోజాని డిజైన్కేఫ్ను ప్రారంభించి, రెండు దశాబ్దాలుగా, తమ జాతీయ, అంతర్జాతీయ అనుభవాన్ని జోడిస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన డిజైన్లను రూపొందిస్తూ విజయఢంకా మోగిస్తున్నారు. వీరు తమ విస్తృత అనుభవాన్ని క్రోడీకరించి, బెంగుళూరులో 35 వేల చదరపు అడుగుల వైశాల్యం లో నిర్మించిన సొంత ఫ్యాక్టరీలో, తమ సొంత డిజైనర్లు, ఉద్యోగులతో ఒక సమగ్ర వ్యాపార సంస్థను స్థాపించారు. వీరిద్దరూ తమ అద్భుత అవిష్కరణలతో, మాయాజాలంతో, భారతీయ కుటుంబాల గృహాలంకరణకు సంబంధించిన అన్ని ఉత్పత్తులూ ఒకేచోట, అందుబాటు ధరల్లో, సరళతరంగా లభించేలా కృషి చేస్తున్నారు. కంపెనీ ప్రస్తుతం ... పూర్తిగా డిజైన్ చేసి సిద్ధంగా వుంచిన ఇళ్లను కస్టమర్లు ఆర్డర్ చేసిన 45 రోజుల్లోనే అందిస్తోంది. ప్రతి ఇంటికీ 10 సంవత్సరాల పూర్తి వారంటీని కూడా అందిస్తోంది. ప్రస్తుతం 900 పైగా వున్న తమ ఉద్యోగుల తోడ్పాటుతో కంపెనీ ... వివిధ ప్రాంతాల్లో వేలకొద్దీ ఇళ్ళను ఇంటీరియర్ పనులు పూర్తి చేసి వినియోగదారులకు అందిస్తోంది. ప్రస్తుతం ముంబై, థానే, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూరులలో డిజైన్‌కేఫ్ సేవలు అందుబాటులో వున్నాయి.