Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆర్ట్ మరియు ఆటోమొబైల్స్ మధ్య ప్రత్యేక అనుబంధాన్ని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా న్యూ ఢిల్లీలో ఏప్రిల్ 28 నుంచి మే 1, 2022 వరకు నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెయిర్ సరికొత్త ఎడిషన్ ‘ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటి’లో ప్రదర్శించనుంది. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ, ‘‘ప్రపంచం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండనుంటుందో అని చేసే సుందర విధానంగా ఉంది. గతంలో కన్నా ఇండియా ఆర్ట్ ఫెయిర్ ఆర్ట్, సృజనశీలత మరియు విస్తరిస్తున్న సోషియో-ఎలకాలజికల్ సెన్సిబిలిటీల ప్రత్యేక సంయోజనను ప్రతిఫలిస్తుంది. అదే తరహాలో బీఎండబ్ల్యూ గ్రూపు ప్రమోటర్ల దూరదృష్టి దాని వాహనాల ద్వారా ప్రతిఫలిస్తుంది. మా ఎలక్ట్రిక్ వెహికల్స్ సుస్థిర భవిష్యత్తుకు అభివ్యక్తీకరణగా ఉన్నాయి. కళాకారుడు ఒక కేంద్రంలోని వస్తువు చుట్టూ కళను అభివృద్ధి పరుస్తున్నట్లే, బీఎండబ్ల్యూ గ్రూపు సస్టెయినబిలిటీ చుట్టూ ఇ-వెహికల్స్‌ను ఆకారం, పని మరియు భావనలో అభివృద్ధిపరుస్తుంది. జాయ్ ఈజ్ బార్న్ తరహాలో మేము ప్రపంచంతో మా దృష్టికోణాన్ని పంచుకునేందుకు ఉత్సుకతతో ఉన్నాము. ఇప్పటికే BMW iX మరియు MINI SE భారతదేశంలో వాహనాలంటే ఇష్టపడే ఔత్సాహికుల మనసులను గెల్చుకుంది. ప్రతి ఒక్కరూ ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో అభ్యుదయ ఇ-మొబిలిటీ ప్రదర్శన అనుభవాన్ని అందుకునేందుకు ఆహ్వానిస్తున్నాము’ అని తెలిపారు.
ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో ‘ప్రజెంటింగ్ పార్ట్నర్’గా 2012 నుంచి బీఎండబ్ల్యూ ఇండియా మోడరన్ ఇండియన్ ఆర్ట్ మరియు కళాకారుల వికాసం మరియు ప్రదర్శనకు మద్ధతు ఇస్తూ వచ్చింది. ఈ ఏడాది భాగస్వామ్యం ద్వారా BMW ఇండియా తన ఆల్-ఎలక్ట్రిక్ రేంజ్‌కు ప్రత్యేక ప్రదర్శనతో ప్రగతిపరమైన ఇ-మొబిలిటీని ప్రదర్శించనుంది. అలాగే BMW iX అనేది బీఎండబ్ల్యూ రూపొందించిన మొదటి ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ వెహికల్. ఇది BMW గ్రూపులో కొత్త టెక్నాలజీ ఫ్లాగ్‌షిప్‌గా ఇది ప్రత్యేక లక్షణమైన ‘శియర్ డ్రైవింగ్ ప్లెజర్’ను సుస్థిరత బద్ధతతో సమర్పిస్తుంది. బార్న్ ఎలక్ట్రిక్ iX తన పూర్తి లైఫ్ సైకిల్ వ్యాప్తంగా ఉత్పత్తి నుంచి ఎండ్-ఆఫ్-లైఫ్ వరకు సస్టెయినబిలిటీ తత్వాలను అలవర్చుకోగా, సహజమైన మరియు రీసైక్లబల్ వస్తువులను సమగ్రంగా వినియోగించుకుంటుంది. ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో MINI తన ఫస్ట్ ఆల్-ఎలక్ట్రిక్ MINI 3- డోర్ కూపర్ SE ప్రదర్శించనుంది. మరియు MINI 3-డోర్ కూపర్ SE అనేది MINI's ఆవిష్కారాత్మక స్ఫూర్తి మరియు ఐకానిక్ డిజైన్‌ను తక్షణ టార్క్‌తో సంయోజించి జీరో ఉద్గారాలు మరియు లెజండరీ గో-కార్ట్ ఫీలింగ్‌ను సంయోజిస్తుంది. ఇది సృజనశీలత కలిగిన వ్యక్తులు మరియు ట్రెండ్ సెట్టర్లకు మౌన విప్లవాన్ని ఉత్తేజించేందుకు స్ఫూర్తి నింపడంలో గమనార్హమైన పాత్రను పోషిస్తుంది. అలాగే BMW iX మరియు MINI కూపర్ SE లతో BMW గ్రూపు ఇండియా అత్యంత నిరీక్షణల మరొక ఆల్- ఎలక్ట్రిక్ ఉత్పత్తిని కూడా ప్రదర్శిస్తోంది.
ప్రదర్శనలో BMW ఇండియా కళాకారుడు ఫైజల్ హసన్ ‘ది ఫ్యూచర్ ఈజ్ బార్న్ ఆఫ్ ఆర్ట్’ కమిషన్ BMW iX కారు ‘సునో’ను కూడా ప్రదర్శిస్తోంది. ‘ది ఫ్యూచర్ ఈజ్ బార్న్ ఆఫ్ ఆర్ట్’ BMW ఇండియా మరియు ఇండియా ఆర్ట్ ఫెయిర్ ఇనీషియేటివ్ కాగా, అది వర్థమాన భారతీయ కళాకరులకు ఉత్తేజాన్ని, ఆర్ట్ మరియు సస్టెయినబిలిటీ మరియు ఇన్నోవేషన్‌కు BMW గ్రూపు నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఇక్కడ BMW iX క్యాన్వాస్గా వినియోగించబడుతుంది మరియు ‘సస్టెయినబుల్ సెక్యులారిటీ’ తత్వాన్ని ప్రతిబింబించేందుకు కళాకారులకు స్ఫూర్తి నింపుతుంది. ఎంపికైన నలుగురు కళాకారులు ఈ వస్తువుపై వారి ప్రత్యేక ప్రజెంటేషన్‌ను ప్రతిబింబించే ఆలోచనలను సమర్పించాలని కోరతారు. ఫైజల్ హసన్ ద్వారా విజేత డిజైన్‌ను BMW iX పై కార్ ర్యాప్‌గా ప్రతిబింబించనుంది మరియు మేళాలో ప్రదర్శించనున్నారు.
బీఎండబ్ల్యూ కల్చరల్ కమిట్మెంట్ గురించి:
ఇప్పుడు 50 ఏళ్ల నుంచి బీఎండబ్ల్యూ గ్రూపు ప్రపంచ వ్యాప్తంగా వందలాది సాంస్కృతిక సహకారాలను ప్రారంభించింది మరియు క్రియాశీలకంగా ఉంది. ఆధునిక మరియు కాంటెంపరరీ ఆర్ట్, క్లాసికల్ మ్యూజిక్, జాజ్ మరియు సౌండ్ అలాగే ఆర్కిటెక్చర్ మరియు డిజైన్‌పై దాని దీర్ఘావధి నిబద్ధత అలాగే దృష్టిని కేంద్రీకరించింది. ఐకానిక్ బీఎండబ్ల్యూ ఆర్ట్ కార్స్ కమిషనింగ్ మాత్రమే కాకుండా బీఎండబ్ల్యూ టేట్లివ్, బీఎండబ్ల్యూ ఆర్ట్ ప్రయాణపు సహ కార్యక్రమాలు మరియు ‘ఒపేరా ఫర్ ఆల్’ కన్సర్ట్లకు కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామి మ్యూజియాలు మరియు ఆర్ట్ మేళాలు అలాగే ఒపేరా హౌస్‌లతో కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
మొదటి నుంచీ బీఎండబ్ల్యూ ఇండియా దేశ వ్యాప్తంగా అగ్రగామి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రముఖ బీఎండబ్ల్యూ ఆర్ట్ కార్స్ ‘రోలింగ్ స్కల్ప్చర్స్’గా ఖ్యాతినార్జించి, భారతదేశంలో వాహనం అలాగే డిజైన్ ఔత్సాహికులకు ప్రోత్సహించింది. ప్రపంచ ప్రఖ్యాత కళాకరులైన ఆండి వార్హోల్, రోయ్ లిచెన్స్టిన్, జెఫ్ కోన్స్, సాండ్రో చియా మరియు సీజర్ మన్రిక్లు సృస్టించిన బీఎండబ్ల్యూ ఆర్ట్ కార్ క్రియేషన్లను ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. అలాగే బీఎండబ్ల్యూ ఇండియా సాంస్కృతిక నిబద్ధత ఇండియా ఆర్ట్ ఫెయిర్ మరియు కొచ్చి-ముఝిరిస్ బైయెన్నెల్ వంటి వేదికల దీర్ఘావధి భాగస్వామ్యాల ద్వారా శాశ్వతంగా మారాయి. ఆవిష్కరాత్మక బీఎండబ్ల్యూ గుగ్గెన్‌హీమ్ ల్యాబ్ డా.భౌదజి లాడ్ మ్యూజియం భాగస్వామ్యంలో భారతదేశంలో ఉంది. సృజనశీలత కలిగిన కళలు మరియు సంవాదం ద్వారా బీఎండబ్ల్యూ వైవిధ్యమయ ప్రేక్షకులకు మరియు సముదాయాలకు నగరీకరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించేందుకు స్ఫూర్తి అందిస్తోంది.
ఇండియా ఆర్ట్ ఫెయిర్
ఇండియా ఆర్ట్ ఫెయిర్ సౌత్ ఆసియాలో ఆధునిక మరియు కాంటెంపరీ ఆర్ట్‌ను ఆవిష్కరించేందుకు మరియు వేడుక చేసుకునేందుకు అగ్రగామి ప్లాట్ఫారం కాగా రెండేళ్ల గ్యాప్ అనంతరం తన భౌతిక మోడల్‌కు తిరిగి వచ్చింది. ఇది బీఎండబ్ల్యూ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న ఈ మేళా 16 నగరాల్లో ప్రదర్శకులకు సమర్పిస్తుండగా, అందులో లాభరహిత ఫౌండేషన్లు మరియు సంస్థలు కలిసి ఉన్నాయి. ఇండియా ఆర్ట్ ఫెయిర్ డైరెక్టర్ జయా అసోకన్ నేతృత్వంలో ఈ ఎడిషన్ తదుపరి తరాలకు చెందిన కళాకారులతో ఆడిటోరియంలో చర్చలు, ప్రదర్శనలు, ఔట్‌డోర్‌లో ఆర్ట్ ప్రణాళికలు, కళాకారుల-ప్రేరిత వర్క్‌షాప్‌లు మరియు ఆన్లైన్ సింపోజియం కలిసి ఉంటాయి. ఈ ప్రాంతంలో అగ్రగామి సంస్థలతో దీర్ఘకాలిక బాంధవ్యాలను కొనసాగించిన తదుపరి ఎడిషన్ కొచ్చి బైయెన్నేల్ ఫౌండేషన్, చెన్నై ఫొటో బైయెన్నేల్ ఫౌండేషన్ మరియు సెరెండిపిటి ఆర్ట్స్ పాల్గొనడాన్ని చూడవచ్చు. వార్షిక కార్యక్రమాలే కాకుండా తన పాత్రను విస్తరించిన ఇండియా ఆర్ట్ ఫెయిర్ తన డిజిటల్ వ్యాప్తిని విస్తరించడం ద్వారా స్థానిక మరియు అంతర్జాతీయ కళా వలయానికి మహోన్నతమైన అడుగులు వేస్తోంది.