Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ డివిజన్ (ఎంసీఈ) నేడు తమ వినూత్నమైన, వైవిధ్యమైన వినియోగదారుల విలువ ప్రతిపాదన ‘లీటరుకు అత్యధిక ఉత్పాదకత లేదంటే మెషీన్‌ను తిరిగివ్వండి’ గ్యారెంటీ పథకాన్ని తమ బీఎస్ 4 శ్రేణి బ్లాక్‌హో లోడర్స్–మహీంద్రా ఎర్త్ మాస్టర్ కోసం అందిస్తుంది. ఈ నూతన శ్రేణిలో నిరూపితమైన, ఆధారపడతగిన 74 హెచ్‌పీ సీఆర్ఐ మహీంద్రా ఇంజిన్ మరియు మరెన్నో ఇతర సాంకేతికత ఆవిష్కరణలు ఉన్నాయి. వీటితో పాటుగా విప్లవాత్మక ఐమ్యాక్స్ టెలిమ్యాట్రిక్స్ సొల్యూషన్స్ కూడా ఉండటం చేత మెరుగైన ఇంధన సామర్థ్యంకు హామీ ఇస్తుంది. నిర్వహణ ఖర్చులలో అత్యధిక మొత్తం (దాదాపు 50%) ఇంధన ఖర్చులే ఉంటుంటాయి. వినూత్నమైన ఫీచర్లు అయినటువంటి బనానా బూమ్, జాయ్ స్టిక్ లీవర్, విస్తృతశ్రేణి డిజైన్, పెద్దవైన బకెట్స్ కలిగిన ఎర్త్ మాస్టర్ శ్రేణి అన్ని రకాల బ్యాక్‌హో అప్లికేషన్లకూ అనుకూలంగా ఉంటుంది. అంటే మైనింగ్, ట్రెంచింగ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదా నిర్మాణ రంగ పరిశ్రమలో మరేదైనా ఇతర పనిలో ఇది తోడ్పడుతుంది. మహీంద్రా బీఎస్4 బ్యాక్‌హో లోడర్– ఎర్త్ మాస్టర్, ఈ పోటీ ప్రయోజనాలతో పూర్తి మనశ్శాంతిని వినియోగదారులకు అందించడంతో పాటుగా తమ సీఈ వ్యాపారాలు విస్తరించేందుకు, అధిక సంపద సృష్టించేందుకు సైతం తోడ్పడుతుంది. ఈ సందర్భంగా జలాల్ గుప్తా, బిజినెస్ హెడ్,కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ యూనిట్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ గ్యారెంటీగా అత్యధిక లీటర్ ఉత్పాదకత (లేదా మెషీన్ తిరిగివ్వండి) వాగ్ధానం, నిర్మాణ రంగ పరిశ్రమలో ఓ ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలుస్తుంది. వేగంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపధ్యంలో ఈ వినియోగదారుల విలువ ప్రతిపాదనను పరిచయం చేయడానికి మించిన సమయం ఏదీ లేదు. సాంకేతికంగా అత్యాధునికమైన, ఈ తరగతిలో అగ్రగామి ఉత్పత్తులు సృష్టించడంతో పాటుగా భారతీయ సీఈ పరిశ్రమలో అత్యున్నత ప్రమాణాలు నిర్థేశించడంలో మా వినియోగదారుల నమ్మకాన్ని ఇది పునరుద్ఘాటించనుందని మేము బలంగా నమ్ముతున్నాము. సర్వీస్ అప్‌టైమ్ గ్యారెంటీ మరింతగా మా వినియోగదారుల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా మా ఉత్పత్తులు, అమ్మకం తరువాత సేవల సామర్థ్యం పట్ల మా నమ్మకాన్ని సైతం వెల్లడిస్తుంది’’ అని అన్నారు. జలజ్గుప్తా మరింతగా మాట్లాడుతూ ‘‘మా నూతన బీఎస్ 4 మెషీన్లు అత్యధిక ఇంధన సామర్థ్యం అందిస్తాయి. ఇది భారతీయ వినియోగదారులను లోతులగా అర్ధం చేసుకున్న మహీంద్రా యొక్క అత్యున్నత సాంకేతిక శక్తిని ప్రదర్శిస్తుంది. అదనంగా, సర్వీస్ గ్యారెంటీని ఎంసీఈ అందిస్తుంది. ఇది మెషీన్‌ను వేగవంతంగా తిరిగి పనిచేసేలా చేయడం ద్వారా వినియోగదారునికి అత్యున్నత అప్‌టైమ్ అందిస్తుంది. అత్యాధునిక ఐమ్యాక్స్ టెలిమాటిక్స్ సాంకేతికత, మరింతగా యాజమాన్య నిర్వహణ ఖర్చు తగ్గించడంతో పాటుగా మెషీన్ల పై పూర్తి నియంత్రణను యజమానులకు అందిస్తుంది’’ అని అన్నారు ఈ వైవిధ్యమైన వినియోగదారుల విలువ ప్రతిపాదన ,సీఈ పరిశ్రమలో అగ్రగామి సంస్ధగా తమ ప్రయాణం కొనసాగించేందుకు తోడ్పడుతుందని కంపెనీ నమ్ముతుంది. సర్వీస్ గ్యారెంటీ మరియు పెర్ఫార్మెన్స్ అనేవి నియమనిబంధనలకు లోబడి ఉంటాయి. ఇవి కంపెనీ వెబ్సైట్ www.mahindraconstructionequipment.com వద్ద లభ్యమవుతాయి.