Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ సంవత్సరం 2022 మార్చి నెలలో ఈ ప్రచారోద్యమాన్ని ప్రారంభించి మరియు సంభాషణను ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత, ఈ #ItsNotOk ప్రచారోద్యమం అనే న్యూస్18 నెట్వర్క్ మరియు ట్రూకాలర్ చే ఒక జాతీయవ్యాప్తమైన చొరవ డిజిటల్ చోటులో మహిళా భద్రతకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించుకుంటూ వెళుతూ వేధింపులపై అవగాహనను పెంచేందుకై తెలంగాణ చేరుకొంది. మే 16 వ తేదీన మొదలయ్యే తదుపరి ప్రచారోద్యమ విడతలో, ఆన్లైన్ అదే విధంగా నిజ జీవితంలో మహిళలపై వేధింపులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కలిసి వచ్చే విధాన నిర్ణేతలు, సీనియర్ రాజకీయవేత్తలు మరియు ఇతర హక్కుదారులు/ ప్రముఖులను కలుసుకోవడం జరుగుతుంది.
వేధింపు సమస్యలపై ఇదివరకే అనేక చర్యలను తీసుకునియున్న రాష్ట్రం ఈ చొరవయొక్క తదుపరి విస్తరణను గమనిస్తుంది, అది దేశం యొక్క ఇతర రాష్ట్రాలలోనికి ఈ చొరవను నడపడానికి మరియు మహిళా భద్రత కొరకు గళాలను బలోపేతం చేయడానికి సర్వం సిద్ధం చేసుకొంది. ఈ చర్చలు, తెలంగాణా IT E&C, MA&UD మరియు పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వశాఖల కేబినెట్ మంత్రివర్యులు కెటి రామారావు గారు, తెలంగాణ గిరిజన సంక్షేమము, మహిళా శిశు అభివృద్ధి శాఖామాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు, తెలంగాణ, మహిళా భద్రత పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా గారు, తెలంగాణా I&C మరియు IT ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ గారు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ గారు, పూర్వ ప్రపంచ నం.6 భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కాశ్యప్ వంటి గణ్యులైన ప్రముఖులు మరియు ఇతర గొప్ప వ్యక్తులతో జరుగుతాయి. ఈ విస్తరణ, సమాజములో అతి పెద్దవాటిలో ఒకటి, ఐనా అతి తక్కువగా నివేదించబడుతున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా చేయబడుతున్న ఈ ఏకగ్రీవ కృషిలో పురుష భాగస్వామి పోషించగల కీలకమైన పాత్రను అర్థం చేసుకొని మరియు ప్రోత్సహించడంపై దృష్టి సారించబడుతుంది.
వేధింపులకు సంబంధించిన సమస్యలపై ‘ కాల్ ఇట్ ఔట్ (వెలికి తీయండి)’ అనే చొరవ పట్ల మహిళలకు స్ఫూర్తి కలిగిస్తూ, సైబర్ భద్రత, సైబర్ చట్టాలు, మరియు అట్టి కేసులను రిపోర్టు చేసి ఆశించిన న్యాయానికి దారితీసేందుకు సాధ్యమయ్యే కార్యాచరణలపై సామాన్య ప్రజానీకంలో అవగాహనను పెంపొందించడానికి ఈ ప్రచారోద్యమం లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ విలువైన చర్చల సందర్భంగా తెలంగాణా రాష్ట్ర IT E&C, MA&UD మరియు పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వశాఖల కేబినెట్ మంత్రివర్యులు కెటి రామారావు గారి ప్రధానోపన్యాసం ఉంటుంది మరియు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు, మరియు CNN-న్యూస్18 సీనియర్ రాజకీయ సంపాదకులు మార్యా షాకిల్ వంటి వక్తలు మహిళల కొరకు ఒక సురక్షిత వాతావరణాన్ని కల్పించవలసిన అవసరంపై మాత్రమే కాకుండా ఈ విషయానికి సంబంధించి ఏయే చర్యలు తీసుకోవచ్చునో అనేదానిపైన, ఇంకా సహచరులుగా పురుషులు తమ చుట్టూ ఉన్న మహిళలు సురక్షితమైన మరియు సాధికారతా భావనను పొందేలా పోషించదగిన పాత్రపైన దృష్టి సారిస్తారు.
హాజరైనవారు ప్యానలిస్టుల మధ్య జరిగే సంభాషణలను ఆలకిస్తారు, ఇందులో తెలంగాణ గిరిజన సంక్షేమము, మహిళా శిశు అభివృద్ధి శాఖామాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ గారు, భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు ఒక ప్రభావశీలి అయిన పారుపల్లి కాశ్యప్ గారలు దీనిని పరిష్కరించడానికి సాధ్యమయ్యే చర్యల గురించి యోచిస్తూనే మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల యొక్క విస్తృతిపై తమ అనుభవాలను పంచుకుంటారు.
ఈ కార్యక్రమంలో, డిజిటల్ శకంలో మహిళలు మరియు అమ్మాయిలను వేధింపుల నుండి రక్షించడంపై జరిగే చర్చలో తెలంగాణా I&C మరియు IT ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ గారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్, సునీతా లక్ష్మారెడ్డి గారు, తెలంగాణ, మహిళా భద్రత పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా గారు పాల్గొంటారు.
ఈ ప్రచారోద్యమంపై వ్యాఖ్యానిస్తూ, న్యూస్18 నెట్వర్క్, బిజినెస్ న్యూస్ క్లస్టర్, సిఇఓ స్మృతి మెహరా గారు, “మహిళా భద్రత గురించి యోచించే సమాజంపై దృష్టి సారించే దార్శనికతో, ట్రూకాలర్ భాగస్వామ్యముతో న్యూస్18 నెట్వర్క్, తెలంగాణాలో ఒక చర్చను చేపడుతోంది. #ItsNotOk ప్రచారోద్యమంలోని ఈ దశ, ఒక మహిళ భద్రతకు ఆటంకం కలిగించే ఏ విషయాన్నైనా తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎదుర్కొన్నా వారు #CallItOut చేయడానికి మరియు తత్ఫలితంగా మహిళలకు ఒక సురక్షిత వాతావరణాన్ని కల్పించడానికి ఉద్దేశించబడింది. మహిళల భద్రత పట్ల వారిని సాధికారపరచడంపై దృష్టి సారిస్తూ, సైబర్ అవగాహన పట్ల ఒక మూలముగా ఉండాలని ఈ వేదిక లక్ష్యంగా చేసుకుంటుంది.” అన్నారు.
ప్రగ్యా, డైరెక్టర్ - ప్రజా వ్యవహారాలు, ట్రూకాలర్, ఇలా అన్నారు: “వేధింపులపై ట్రూకాలర్ యొక్క పోరాటాన్ని తెలంగాణకు తీసుకురావడం పట్ల మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. వేధింపుల పరిష్కారములో మరియు దానిని అధికారులకు రిపోర్టు చేయడానికై మహిళల్ని సాధికారపరచడానికి గాను మా #CallItOut ప్రచారోద్యమానికి తెలంగాణ పోలీస్ మరియు ప్రభుత్వం నుండి తోడ్పాటును అందుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. సురక్షిత సమాచార వినిమయంలో కీలక పాత్ర పోషించడానికి ట్రూకాలర్ కట్టుబడి ఉంటుంది.”
ఈ ప్రచారోద్యమం ఇదివరకే, గళమెత్తడానికై మహిళల్ని ప్రోత్సహిస్తూ, వేధింపులను నివేదించడానికి మార్గాల గురించి చర్చించడానికి కలిసి ముందుకు వచ్చిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాకామాత్యులు స్మృతి ఇరానీ, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి శాఖామాత్యులు రాజీవ్ చంద్రశేఖర్, ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేశ్ ఆస్థానా, నటి రవీనా టాండన్ వంటి జాతీయ విధాన నిర్ణేతలు మరియు హక్కుదారులు ఇంకా మరెంతో మందిని కలుసుకొంది. వేధింపుపై పోరాడేందుకు ఈ ప్రచారోద్యమం ప్రతి భారతీయునితో ఒక బంధం కలిగి ఉంది మరియు న్యూస్18 నెట్వర్క్ మరియు ట్రూకాలర్, ఒక రాష్టం నుండి మరో రాష్ట్రానికి ప్రయాణిస్తూ ఇండియాలో బాగా లోతుకు చొచ్చుకుపోయి ఉంది, ఈ యాత్ర ఇప్పుడు తన తర్వాతి మజిలీ-తెలంగాణకు చేరుకొంది.