Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ప్రకృతి అనుకూలమైన రీతిలో అందుబాటు ధరల్లోని గృహాలను ప్రోత్సహిస్తోన్నట్టు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ సంస్థలు తెలిపాయి. తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'కుటుంబ్' 9వ అధ్యాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా ప్రకతి అనుకూలమైన రీతిలో సరసమైన గహాలకు ప్రచారం చేయడంతో పాటుగా, ఖర్చు తగ్గించి విద్యుత్ ఆదా చేసే వాతావరణ అనుకూల గృహాల నిర్మాణం పట్ల అవగాహన విస్తరించడం, వాటి నిర్మాణాన్ని ప్రోత్సహించనున్నట్టు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం హైబ్రిడ్ నమూనాలో హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రిలలో నిర్వహించనున్నట్టు తెలిపాయి.