Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ వెల్లడి
న్యూఢిల్లీ : పలు బ్యాంక్‌ల బాటలోనే గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) వెల్లడించింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) 20 బేసిస్ పాయింట్లు పెంచినట్టు తెలిపింది.ఇటీవల ఆర్బీఐ రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ కీలక వడ్డీరేటు 0.2 శాతం పెంచడంతో..కనీస వడ్డీ రేటు 6.9 శాతానికి చేరింది. ఇంతక్రితం ఇది 6.7శాతంగా ఉంది.ఖాతాదారుల సిబిల్ స్కోర్ 700కం టే ఎక్కువగా ఉంటే వడ్డీరేటుపై 20 బేసిస్ పాయింట్ల పెంపు మాత్రమే వర్తిస్తుందని ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్ సిఇఒ వై విశ్వనాథ్ గౌడ్ పేర్కొన్నారు.