Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మెటల్స్, ఎనర్జీ, మైనింగ్, హెల్త్‌కేర్, కమర్షియల్ అగ్రికల్చర్ సహా విభిన్న వ్యాపారాలను కలిగి ఉన్న నవ భారత్ వెంచర్స్ లిమిటెడ్(ఎన్బీవీఎల్)2022 మార్చి31తో ముగిసే నాల్గవ త్రైమాసికం లో మంచి ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ మేరకు ఎన్వీబీఎల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎగుమతి, దేశీయ మార్కెట్ లలో మాంగనీస్ అల్లారు వ్యాపారంలో 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ బలమైన వద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది. స్థిరమైన వృద్ధి,మొత్తం ఆదాయంలో స్థిరత్వాన్ని వృద్ధి సాధించినట్టు తెలిపింది. ఒడిషా(60ఎండబ్ల్యూ),ఎన్బీఈఐఎల్లో(150ఎండబ్ల్యూ) రెండు ఐపీపీల పున్ణప్రారంభంతో పవర్ డివిజన్ చెప్పుకోదగిన అభివృద్ధి సాధించినట్టు తెలిపింది. కంపెనీ తూర్పు హైదరాబాద్‌లోని అర్బన్ ల్యాండ్ బ్యాంక్‌కు సంబంధించిన చట్టపరమైన కేసును గెలుచుకుంది, ఈ ఆస్తిని మోనటై జేషన్ చేయడానికి మరింత మార్గం సుగమం చేసినట్టు పేర్కొంది.