Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరసగా ఆరు సెషన్లలో నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లు పెరిగి 52,974కు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 60 పాయింట్లు లేదా 0.38 శాతం లాభపడి 15,842 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.5శాతం,1.15శాతం చొప్పున రాణించాయి. నిఫ్టీలో పీఎస్యూ బ్యాంకింగ్ సూచీ అధికంగా 3 శాతం పెరిగింది. మరోవైపు ఐటి సూచీ 0.75శాతం నష్టపోయింది.సెన్సెక్స్-30లో ఎన్టీపీసీ, బజాజ్ ఫినాన్స్, మారుతి సుజుకి, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కొటాక్ బ్యాంక్ సూచీలు 1.6 శాతం నుంచి 2.9 శాతం వరకు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్స్, ఆసియన్ పెయింట్స్, ఐటీసీ,టీసీఎస్,హెచ్సీఎల్ టెక్,నెస్ల్టే,డాక్టర్ రెడ్డీస్ షేర్లు అధికంగా 1-2.8 శాతం వరకు నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.