Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ సిమెంట్ కంపెనీ హోల్‌సిం ఇండియా అనుబంధం అయినా అంబుజా, ఏసీసీ సిమెంట్స్ సంస్థలను అదానీ గ్రూపు సొంతం చేసుకుంది. దాదాపు రూ.79,800 కోట్లు (10.5 బిలియన్ డాలర్లు) చెల్లించి ఈ కంపెనీలను స్వాధీనం చేసుకున్నట్టు అదానీ గ్రూపు వెల్లడించింది. ఈ ఒప్పందంలో అంబుజా సిమెంట్స్‌లో గౌతం అదానీ గ్రూపుకు 63.1 శాతం, ఏసీసీ సిమెంట్స్‌లో 54.53 శాతం వాటాలు దక్కనున్నాయి. ఆఫ్‌షోర్ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా తమ కుటుంబం ఒప్పందం కుదుర్చుకున్నట్టు అదానీ గ్రూపు తెలిపింది. నాన్ ప్రమోటర్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ఇవ్వనున్నట్టు తెలిపింది.