Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు (మే 17న) ఎల్ఐసీ షేర్లు లిస్టింగ్ కానున్నాయి. సోమవారం మదుపర్లకు షేర్లను కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ ఎల్ఐసీ షేర్ల నమోదు ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ ఇష్యూ ద్వారా మోడీ సర్కార్ రూ.20,557 కోట్ల విలువ చేసే షేర్లను మార్కెట్ శక్తులకు విక్రయించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓకు మూడు రెట్ల స్పందన లభించింది. ఈ సూచీ సానుకూలంగా ట్రేడింగ్ కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం షేర్ ధరను రూ.949గా నిర్ణయించింది.