Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెజాన్ ఇండియా వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే 2025 నాటికి దేశంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ దాదాపు 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.37,500 కోట్లు) ఎగుమతులకు తోడ్పాటు అందించినట్టు పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.6 లక్షల పైగా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చామని తెలిపింది. 2021లో టెక్నాలజీ ఆవిష్కరణలపై పనిచేసే ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు వెంచర్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ మనీష్ తివారి తెలిపారు.