Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంపెనీ తన మొదటి క్యాంపెయిన్ని తన సాధకులకు అంకితం చేసింది అనకాడెమీ చే రీలెవెల్, తన సాధకులు తమ విజయాన్ని ప్రదర్శించుకునేందుకు సానుకూలపరచిన తన మొదటి క్యాంపెయిన్ని ప్రారంభించింది. క్యాంపెయిన్లో భాగంగా, కంపెనీ పూర్తిగా సంతృప్తి చెందడంతో 24 నగరాల నుండి 31 మంది సాధకుల విజయాన్ని బిల్బోర్డుల వ్యాప్తంగా పంచుకోవడం జరిగింది.
అనకాడెమీ గ్రూపు కంపెనీ అయిన రీలెవెల్, ఉద్యోగార్థులు పరీక్షల ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికై వారిని సాధికారపరుస్తూ ఇండియా యొక్క మొదటి నియామక వేదికగా ఉంది. అనకాడెమీ చే రీలెవెల్, భారతీయ యువత తమ నైపుణ్యము ఆధారంగా దేశములోని అత్యుత్తమ కంపెనీలు కొన్నింటిలో పని చేయడానికి ప్రాప్యతను ప్రజాస్వామ్యబద్ధం చేస్తుంది. ఈ క్యాంపెయిన్, పల్లవీ సింగ్, నిషా గుప్తా, నవీన్ బాలాజీ వంటి మరెందరో తన సాధకుల విజయాలను మరియు అగ్రగామి కంపెనీలలో వారు ఎలా ఉద్యోగాలు పొందగలిగారో ఆ గాధలను మీ ముందుకు తెచ్చింది. బిల్బోర్డులను చూసిన తర్వాత విజయసాధకులు మరియు వారి కుటుంబాల ప్రతిస్పందనలు హృదయాలను హత్తుకున్నాయి మరియు తమ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి అనేకమంది సామాజిక మాధ్యమాన్ని ఎంచుకున్నారు.
లింక్: https://www.linkedin.com/feed/update
పల్లవి యుజిసి నెట్ పరీక్షకు పూర్తి సమయం కేటాయించి సన్నద్ధం అయ్యేందుకు తాను చేస్తున్న మునుపటి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకొంది, అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా, ఆ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఆమె అనుకున్న దానికంటే చాలా ఎక్కువ కాలం ఆమె కెరీర్ విరామం పొడిగించబడింది. అప్పుడే ఆమెకు ఆన్లైన్ ప్రకటనల ద్వారా రీలెవెల్ గురించి తెలిసి, పరీక్షను తీసుకోవాలని నిర్ణయించుకొంది. రీలెవెల్ ద్వారా, పల్లవి ఒకానొక అగ్రగామి ఎఐ కంపెనీలో ప్రీ-సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం సాధించుకొంది.
లింక్: https://www.linkedin.com/feed/update
నిషా కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం చేయాలని ఎల్లప్పుడూ కలలు కంటూ ఉండేది, ఐతే ఎప్పుడూ ఆమెకు తన కలను సాకారం చేసుకునే అవకాశం రాలేదు. చివరికి ఆమెకు అవకాశం వచ్చినప్పుడు, ఆమె అనేక సంవత్సరాల పాటు ఫీల్డుకు దూరంగా ఉండటం వల్ల ఎక్కడ చూసుకోవాలో తెలియలేదు. ఆమె యూట్యూబ్ ద్వారా రీలెవెల్ గురించి తెలుసుకొంది మరియు దాని కోర్సుల గురించి కనుక్కొంది, అది ఆమె కెరీర్ ని అదే విధంగా ఆమె జీవిత గమనాన్నీ మార్చడానికి సహాయపడింది. ఈ రోజున, ఆమె ఒక డైమండ్ డీలర్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలో ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు.
లింక్: https://www.linkedin.com/posts/
నవీన్ కు చిన్నప్పటి నుండీ సైబర్ సెక్యూరిటీ రంగం పట్ల ఆసక్తిగా ఉండేది ఐతే ఆ కోర్సులు ఎప్పుడూ అతి ఖరీదైనవిగా కనిపించేవి. అతను సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ పై ఆన్లైన్లో చదవడం మొదలుపెట్టాడు, ఆ ఫలితంగా వాటిపై ప్రాథమిక ఆవశ్యకతల్ని పూర్తి చేసుకున్నాడు. అతను లింక్డ్ఇన్ ద్వారా రీలెవెల్ గురించి తెలుసుకున్నాడు మరియు వెంటనే పరీక్షకు హాజరయ్యాడు. ఈ రోజున, అతను తాను కల గన్న ఉద్యోగం, ఒక అగ్రగామి ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.