Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరు దశలలో అత్యాధునిక ఫిలే్ట్రషన్ ప్రక్రియ కలిగి ఉండటంతో పాటుగా సెల్ఫ్ బ్లాకింగ్ ఫిల్డర్ మెకానిజం కలిగి ఉండటం వల్ల అత్యున్నత నాణ్యత కలిగిన తాగు నీటిని అందిస్తుంది
న్యూఢిల్లీ : షార్ప్ కార్పోరేషన్, జపాన్‌కు భారతీయ అనుబంధ సంస్థ అయిన షార్ప్ తమ నూతన వాటర్ ఫ్యూరిఫైయర్ డబ్ల్యుజె-ఆర్515 వీ-హెచ్‌ను భారతీయ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. నూతన స్మార్ట్, ఇంటిలిజెంట్ వాటర్ఫ్యూరిఫయర్ అత్యంత శక్తివంతం కావడంతో పాటుగా ఆరు దశలలో నీటిని శుద్ధి చేసి విభిన్నమైన మలినాలను తొలగిస్తుంది. వినూత్నమైన ఏఎఫ్ డిస్రప్టర్ టెక్నాలజీ కారణంగా ఈ ఫ్యూరిఫైయర్ అత్యున్నత స్థాయి ఫ్యూరిఫికేషన్ అందించడంతో పాటుగా ఆరోగ్యవంతమైన, సురక్షిత నీటికి భరోసా అందిస్తోంది.
అధిక నీటి పొదుపుకు భరోసా అందిస్తూ, షార్ప్ వాటర్ ఫ్యూరిఫయర్ అత్యున్నత నాణ్యత కలిగిన ఆర్ఓ మెంబ్రేన్‌ను అందిస్తుంది. ఇది 50 శాతానికి పైగా నీటిని ఆదా చేయడంతో పాటుగా నీటి నాణ్యత, రుచి సైతం మెరుగుపరుస్తుంది. నీటి ట్యాంక్‌లో యువీ లైట్ జోడించడం వల్ల నిల్వ చేసిన నీరు కూడా క్రమం తప్పకుండా శుద్ధి చేయబడుతుందనే భరోసా అందిస్తూ కేవలం తాజా తాగునీటిని మాత్రమే రోజంతా అందిస్తుందన్న భరోసా అందిస్తుంది.
ఈ ఆవిష్కరణ గురించి షార్ప్ బిజినెస్ సిస్టమ్ (ఇండియా) ప్రయివేటు లిమిటెడ్ షింన్జీ మినటోగవా మాట్లాడుతూ 'సురక్షిత మరియు ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించే ఉత్పత్తులు, పరిష్కారాలకు మద్దతుందించే ఉత్పత్తులలో పెట్టుబడులను షార్ప్ పెడుతుంటుంది. మన రోజువారీ జీవితంలో తాగునీరు అత్యంత కీలకం. మా నూతన వాటర్ ఫ్యూరిఫికేషన్ వ్యవస్థలో అత్యాధునిక ఫిల్టరేషన్, ఏఎఫ్ డిస్రప్టర్ సాంకేతికత ఉంది. ఇది అత్యున్నత నాణ్యత కలిగిన తాగు నీరు మాత్రమే ప్రతిసారీ అందిస్తుందనే భరోసా అందిస్తుంది` అని అన్నారు.
నూతనంగా షార్ప్ విడుదల చేసిన ఈ వాటర్ఫ్యూరిఫైయర్ ధర 35,500 రూపాయలు. ఈ ఉత్పత్తిని నేరుగా వెస్టిజ్ మార్కెటింగ్ ప్రయివేటు లిమిటెడ్ ద్వారా విక్రయిస్తారు.
వెస్టిజ్ మార్కెటింగ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలీ మాట్లాడుతూ 'ఈ నూతన ఆఫరింగ్ మా ప్రయత్నాలను కాంప్లిమెంట్ చేయడంతో పాటుగా మెరుగైన ఆరోగ్యం కోసం అవసరమైన పరిష్కారాలను అందించనుంది` అని అన్నారు.