Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒప్పందానికి బైబై..!
వాషింగ్టన్ : ట్విట్టర్ కొనుగోలుకు అనుహ్యా ఒప్పందం కుదుర్చుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. నేరుగా ఈ విషయాన్ని చెప్పకుండా.. ట్విట్టర్లో నకిలీ ఖాతాలు భారీగా ఉన్నాయని.. అది తేల్చితే గాని తాను ముందుకు రాలేనని తాజాగా మరోసారి పునరుద్గాటించారు. ఈ రహస్యం వీడితే తప్పా తానేమి చేయలేనని కొత్త రాగం ఎత్తుకున్నారు. కాగా.. దీంతో ట్విట్టర్ ఒప్పందంపై పూర్తిగా నీలినీడలు కమ్ముకున్నట్లయ్యింది. ట్విటర్ మొత్తం అకౌంట్లలో ఫేక్ ఖాతాలు 5 శాతం ఉంటాయని ఆ సంస్థ సిఇఒ పరాగ్ అగర్వాల్ పేర్కొంటున్నారు. కాగా.. ఈ నకిలీ ఖాతాలు 20 శాతం వరకు ఉంటాయని మస్క్ ఆరోపిస్తున్నారు. దీనిపై స్పష్టత ఇస్తేనే తాను రూ.3.2 లక్షల కోట్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ తెగేసి చెప్పారు. కాగా.. నకిలీ ఖాతాలు ఎన్ని ఉన్నాయో నిర్దారించేందుకు బయటి వ్యక్తులకు అనుమతి ఇవ్వబోమని పరాగ్ తెలిపారు.