Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నీతి ఆయోగ్‌కు ప్రతిష్టాత్మక నేషనల్ డాటా అండ్ ఎనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ (ఎన్‌డీఏపీ)ని అభివృద్థి చేసి ఇచ్చినట్టు ఐటీ, కన్సల్టింగ్ సేవల సంస్థ ఆబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా (ఓటీఎస్ఐ) వెల్లడించింది. దీనిని గత వారం లాంచనంగా విడుదల చేయడం ద్వారా సాంకేతిక భాగస్వామిగా మారినట్టు పేర్కొంది. ఈ పోర్టల్ ప్రజలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, పరిశోధకులు, ఇనిస్టిట్యూషన్, అంతర్జాతీయ సంస్థలు మొదలైన వాటికి సహాయపడటంతో పాటుగా పలు శాఖల వ్యాప్తంగా సమాచారాన్ని అతి సులభంగా విశ్లేషించేందుకు తగిన అవకాశాలనూ కల్పిస్తుందని ఓటీఎస్ఐ పేర్కొంది. ఈ సమాచారం 14 రంగాలలో అందుబాటులో ఉండటంతో పాటుగా భవిష్యత్‌లో గ్రామ స్ధాయి డాటాను కూడా అందించే రీతిలో తీర్చిదిద్దనున్నట్టు తెలిపింది.