Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వేధింపులకు వ్యతిరేకంగా న్యూస్18 నెట్వర్క్ మరియు ట్రూ కాలర్ యొక్క దేశవ్యాప్త చొరవ #CallItOut తెలంగాణాలో ప్రభావపూర్వక చర్చల విడతలతో జయప్రదంగా ముగిసింది. మహిళలచే ఎదుర్కోబడుతున్న వేధింపుకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలవాల్సిన అవసరంపై దృష్టి సారిస్తూ, ఈ చొరవ ఆన్లైన్ లో అదే విధంగా వాస్తవ ప్రపంచంలో మహిళల భద్రతను ప్రోత్సహిస్తోంది. సహచరులుగా పురుషుల పాత్రను గుర్తిస్తూ, ఈ ఈవెంటులో వివిధ క్రీడలు, రాజకీయ మరియు పోలీస్ నేపధ్యం గల ప్రభావపూర్వక ప్రముఖ వ్యక్తులు పాల్గొని, ఇండియా వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలలో అత్యంత ఎక్కువగా బాధిస్తున్న వేధింపు సమస్యపై గళం విప్పారు. తెలంగాణా యొక్క అసాధారణమైన డిజిటల్ ప్రయాణం యొక్క కొన్ని అంశాలను పంచుకుంటూ, మరియు ఆన్లైన్ భద్రత యొక్క అవసరం పట్ల ప్రాధాన్యతను పేర్కొంటూ, తెలంగాణ ఐటి E&C, MA&UD పరిశ్రమలు & వాణిజ్య శాఖల కేబినెట్ మంత్రి శ్రీ కె.టి. రామారావు గారు ఇలా అన్నారు, “ఆన్లైన్ దురుపయోగాన్ని ఫిర్యాదు చేయాలనుకునే మహిళల కోసం మేము సంభావ్యతగా విడిగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాము. మిగతా దేశానికి తెలంగాణ ప్రకాశవంతమైన ఒక ఉదాహరణ కావడానికి సహాయపడేలా అంకితమైన వనరులు అందజేయబడేలా మేము చూసుకుంటాము.” ఆయన ఇంకా మాట్లాడుతూ, “ప్రత్యేకించి వర్చువల్ ప్రపంచంలో వాక్ స్వాతంత్ర్యం మరియు ఆన్లైన్ వేధింపు మధ్యన ఒక సన్నని రేఖను గీయాల్సిన అవసరం ఉంది. తెలంగాణా ప్రభుత్వం సైబర్ నేరస్థులపై సాధ్యమైన ప్రతి కఠిన చర్యనూ తీసుకుంటూనే మహిళలకు ఈ అంశం విషయంగా సాధికారత తెచ్చే చర్యలను తీసుకురావడం కొనసాగిస్తుంది.” అన్నారు. తెలంగాణ ఐటి E&C, MA&UD మరియు పరిశ్రమలు & వాణిజ్య శాఖల కేబినెట్ మంత్రి శ్రీ కె.టి. రామారావు గారి ప్రధానోపన్యాసం తర్వాత, ఈ వేదిక తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీమతి కె. కవిత గారు, మరియు న్యూస్18నెట్వర్క్ సీనియర్ రాజకీయ సంపాదకులు శ్రీమతి మార్యా షాకిల్ గారి మధ్య ఒకదాని తర్వాత మరొకటిగా చర్చలు జరగడానికి తెర తీసింది. ఈ చొరవను ప్రశంసిస్తూ శ్రీమతి కె.కవిత గారు, మహిళల్ని జెండర్ వివక్షకు అతీతంగా ఎదగడానికి ప్రోత్సహిస్తూనే వారిని ఆర్థికంగా అదే విధంగా సామాజికంగా కూడా సాధికారపరచ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇంకా ఆమె ఇలా అన్నారు, “దీనికి ఒక తార్కికమైన ముగింపు పలకడానికి గాను మహిళల్ని కలవరపెడుతున్న విషయాలను రిపోర్టు చేయాల్సిన అవసరంపై దృష్టి సారిస్తూ వేధింపును అధిగమించడానికి ఒక సమన్వయాత్మక కృషి అవసరమై ఉంది.” పురుష భాగస్వాములను సహచరులుగా పేర్కొంటూ మంత్రిగారు, మహిళా భద్రత చుట్టూ సమాచార వినిమయం యొక్క సరిహద్దుల్ని విస్తరింపజేయగల ఒక అదనపు శక్తిగా వారిని పేర్కొన్నారు. #CallItOut మరియు రిపోర్టు చేయడం పట్ల మహిళలకు ప్రేరణ కలిగిస్తూ, తర్వాతి దశ చర్చ పోలీస్ శాఖ లోని ప్రముఖ వక్తల అభిప్రాయాలను వెలికి తీసింది, వారు – శ్రీమతి స్వాతి లక్రా గారు, అదనపు డిజిపి, షి టీములతో సహా మహిళా భద్రత మరియు భరోసా కేంద్రాలు, తెలంగాణా రాష్ట్రం; శ్రీ జయేష్ రంజన్ గారు - ప్రిన్సిపల్ సెక్రెటరీ ITE&C& C డిపార్ట్మెంట్., తెలంగాణ ప్రభుత్వము, మరియు సి.వి. ఆనంద్, కమీషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్. మహిళల భద్రత మరియు రక్షణ కోసం ప్రత్యేకంగా పని చేయడానికి ప్రారంభించబడి, మహిళల రక్షణ కవచంగా ప్రజాదరణ పొందిన కార్యదళం అయినటువంటి షి- టీములు పోషించిన అసాధారణమైన పాత్ర గురించి వక్తలు వివరించారు. శ్రీ ఆనంద్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, వారికి కౌన్సెలింగ్ ఇస్తోందని, కాబట్టి మహిళలు తమకు ఇబ్బందికరమైన దేని గురించైనా రిపోర్టు చేయడానికి సౌకర్యవంతంగా ముందుకు రావచ్చుననీ తెలియజేశారు. మరో వైపున శ్రీమతి స్వాతి గారు మాట్లాడుతూ, మహిళలకు ఒక సురక్షిత డిజిటల్ చోటు అందించడానికి మరియు సైబర్ రాయబారులను అభివృద్ధి చేయడానికి ప్రారంభించబడిన CybHER మరియు సైబర్ కాంగ్రెస్ వంటి చొరవలను నడిపినప్పటి తన అనుభవం గురించి సభికులకు తెలియజేశారు. టెక్నాలజీ వాడకము మరియు సకాలములో చొరవను తీసుకోవడంలో ఒక సమతుల్యత యొక్క అవసరంపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ, శ్రీ జయేష్ రంజన్ గారు ఇలా అన్నారు, “డిజిటలైజేషన్ అనేది ముఖ్యమే, అయితే ఈ చోటు విస్తృతమయ్యే కొద్దీ మనకు అధునాతనమైన టెక్నాలజీ యొక్క అవసరం ఉంటుంది.”
ఈ చర్చలో శ్రీమతి ఉపాసనా కామినేని గారు, విసి – అపోలో లైఫ్ మరియు బి పాజిటివ్ మేగజైన్ ప్రధాన సంపాదకులు కూడా పాల్గొని, డిజిటల్ పరిశుభ్రత యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు మరియు శ్రీ జె. శ్రీనివాస రావు గారు, ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్, పాల్గొని మహిళా భద్రత అనేది సమాజము లోని ప్రతి వ్యక్తి యొక్క సమస్యగా భావించాలని పిలుపునిచ్చారు.
ఇతర ప్యానలిస్టులతో సహా ఈ వేదికను పంచుకున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు – శ్రీ పారుపల్లి కాశ్యప్ గారు ఈ సమస్య గురించి మరింత అవగాహనను వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖంగా ప్రస్తావించారు, కాగా వేధింపుల చుట్టూ సమస్యలలో చురుగ్గా నిమగ్నమవుతూ వస్తున్న వ్యక్తి, యంగిస్థాన్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ – శ్రీ వై. అరుణ్ డేనియల్ కుమార్ గారు మహిళలను సాధికారపరచడంలో పురుషులు పోషిస్తూ వస్తున్న పాత్రను ప్రశంసించారు మరియు సాధికారతా ధ్యాసను వృద్ధిచేస్తున్న ఈ సదస్సు అందించిన చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవలసిందిగా సభికులను ప్రోత్సహించారు.