Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు అత్యంత పెద్ద లెర్నింగ్ ప్లాట్ఫారం* అన్అకాడమి నేడు తన తదుపరి కొత్త అన్అకాడమి సెంటర్ల ద్వారా ఆఫ్‌లైన్ లెర్నింగ్ విభాగానికి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ అన్అకాడమి సెంటర్లు నేర్చుకునే వారికి ఆఫ్‌లైన్‌లో నేర్చుకునే వారికి సౌలభ్యాన్ని అందించనున్నాయి మరియు నీట్ యుజి, ఐఐటి జెఇఇ ఫౌండేషన్ (9-12) కోర్సు విభాగాల్లో అగ్రగామి బోధనకు అందుబాటును విస్తరించనుంది. అన్అకాడమి విద్యార్థులకు అంతర్గత-వ్యక్తిగత మార్గదర్శనానికి వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను ఈ కొత్త విధానంలో భర్తీ చేయనుంది. అన్అకాడమి కేంద్రం రానున్న నెలల్లో కోటాలో తన కార్యాచరణను ప్రారంభించనుంది, అనంతరం జైపూర్, బెంగళూరు, చండీగఢ్, అహ్మదాబాద్, పాట్నా, పుణె మరియు ఢిల్లీలో అదే తరహాలో టచ్ పాయింట్లను ప్రారంభించనుంది. ఆఫ్‌లైన్ బ్యాచ్‌లు అగ్రగామి బోధకుల వద్ద రిజిస్ట్రరు చేసుకున్న విద్యార్థులు అందరికీ అత్యుత్తమ అన్అకాడమి ఆఫర్లు, బోధన విధానం మరియు భారతదేశంలో అత్యుత్తమ అధ్యాపకులు రూపొందించిన అధ్యయన అంశాలు, వ్యక్తిగత మార్గదర్శనం మరియు సందేహ నివృత్తి, క్రమం తప్పకుండా తల్లిదండ్రులు- అధ్యాపకులతో సమావేశాలు మరియు ఫ్లాగ్షిప్ ఆఫ్‌లైన్ లెర్నింగ్ అనుభవాన్ని హై-టెక్ మౌలిక సదుపాయాలతో అందిస్తుంది. అన్అకాడమి కేంద్రాలన్నింటిలో ఈ బ్రాండ్ మొదటి బ్యాచ్‌లో 15,000 లెర్నర్ల వరకు రిజిస్ట్రరు చేసుకునే లక్ష్యాన్ని కలిగి ఉంది. అన్ని అన్అకాడమి కేంద్రాలు త్వరలో కోటా నుంచి ప్రారంభమై క్రమం తప్పకుండా ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభిస్తుండగా, నేషనల్ స్కాలర్శిప్- అడ్మిషన్ టెస్టును బ్యాచ్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి నిర్వహిస్తుంది. అందులో ర్యాంకు పొందిన వారు స్కాలర్షిప్లను గెల్చుకోవచ్చు. కంపెనీ ఈ టెస్టు గురించి మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనుంది.
దీని గురించి అన్అకాడమి గ్రూపు సహ-వ్యవస్థాపకుడు మరియు సీఈఓ గౌరవ్ ముంజాల్ మాట్లాడుతూ, ‘‘మా ఎక్స్‌పీరియన్షియల్ టచ్పాయింట్లు- ‘అన్అకాడమి వరల్డ్’ విద్యార్థుల నుంచి అద్భుతమైన ప్రతిస్పందన అందుకోగా, అందులో పలువురు అత్యుత్తమ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తిగత లెర్నింగ్ అవసరం కూడా ఉంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘అన్అకాడమి సెంటర్ల’ ద్వారా అన్అకాడమి శ్రేష్ఠతను మేము మా విద్యార్థులకు భారతదేశంలోని అగ్రగామి అధ్యాపకులు, ఈ శ్రేణిలో అత్యుత్తమ సాంకేతికత మరియు ఉత్పత్తులు అలాగే అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాము. మేము భౌతిక లెర్నింగ్ సెంటర్లకు అడుగుపెట్టడం పోటీ ధరల్లో అత్యుత్తమ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులకు వారి లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మరియు భారతదేశ వ్యాప్తంగా వారు విస్తరించేందుకు మద్ధతు ఇస్తుందన్న విశ్వాసం మాకు ఉంది’’ అని ఆయన వివరించారు.
ఈ కేంద్రాలు ‘అన్అకాడమి వరల్డ్’లో అత్యాధునిక ఫ్రేమ్‌వర్క్‌లో నిర్మించారు. కోటాలో ఈ 18,000 చ.అడుగుల ప్రదేశం నాలుగు అంతస్తుల్లో విస్తరించి ఉండగా, నగరంలో అత్యుత్తమ లెర్నింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అగ్రగామి అధ్యాపకులతో ఆఫ్‌లైన్ తరగతులకు మద్ధతుగా విద్యార్థులకు అక్కడికక్కడే కౌన్సెలర్లు, అత్యాధునిక గ్రంఘాలయం మరియు బ్రాండ్ మర్చంటైజ్ ఈ అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి.